Delhi Election 2020: పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఆప్‌కు ఆ పార్టీ మద్దతు

Delhi Assembly Election 2020: ఢిల్లీ ఎన్నికల్లో గెలిచేందుకు దీన్ని హిందువులు, ముస్లీంలకు మధ్య జరుగుతున్న పోటీగా మార్చేందుకు కేంద్ర మంత్రులు, సీనియర్ బీజేపీ నేతలు అడ్డగోలు ప్రయత్నాలు చేశారంటూ శివసేన ఎద్దేవా చేసింది.

news18-telugu
Updated: February 7, 2020, 5:28 PM IST
Delhi Election 2020: పోలింగ్‌కు ఒక్కరోజు ముందు ఆప్‌కు ఆ పార్టీ మద్దతు
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్(ఫైల్ ఫోటో)
  • Share this:
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కు ఒక్క రోజు ముందు ఆమ్ ఆద్మీ పార్టీకి మహారాష్ట్రలో అధికారపక్షమైన శివసేన మద్దతు ప్రకటించింది. అర్వింద్ కేజ్రీవాల్ ఐదేళ్ల పాలన భేష్ అంటూ ‘సామ్నా’ సంపాదకీయంలో ప్రశంసల జల్లుకురిపించింది. ఢిల్లీ తరహా అభివృద్ధిని దేశంలోని ఇతర రాష్ట్రాలకు కూడా జరిగేలా చూడాలని కేంద్రాన్ని కోరింది. అటు మోదీ సర్కారు తీరుపై మరోసారి విమర్శనాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో మెరుగైన పాలన అందించినందుకు కేజ్రీవాల్‌ను ప్రధాని మోదీ, హోం శాఖ మంత్రి అమిత్ షా అభినందించి ఉంటే బాగుండేదని అభిప్రాయపడింది. అయితే ఎన్నికల్లో గెలిచేందుకు హిందువులు, ముస్లీంలకు మధ్య జరుగుతున్న పోటీగా మార్చేందుకు మంత్రులు, సీనియర్ బీజేపీ నేతలు అడ్డగోలు ప్రయత్నాలు చేశారంటూ ఎద్దేవా చేసింది.

‘ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించేందుకు ప్రధాని మోదీ, అమిత్ షా చేయాల్సిందల్లా చేశారు. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో వారు అధికారంలోకి రాలేకపోయారు. అందుకే ఎలాగైనా ఢిల్లీలో అధికారంలోకి రావాలని ఉవ్విళ్లూరుతున్నారు. ఢిల్లీలో అధికారంలోకి రావాలని వారు కోరుకోవడంలో తప్పేమీలేదు’ అని శివసేన వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఢిల్లీలో గెలవాలన్న లక్ష్యంతో దేశ నలుమూలల నుంచి 200 మంది ఎంపీలు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులను ఇక్కడ మోహరించింది. అయినా వారికంటే అర్వింద్ కేజ్రీవాల్ బలమైన వ్యక్తిగా నిలిచారని పేర్కొంది.

elections 2019, maharashtra government, uddhav thackeray, shiv sena, maharashtra assembly elections, maharashtra government formation, maharashtra news, telugu varthalu, news updates, breaking news, telugu news, news today, daily news, news online, national news, india news, నేషనల్ న్యూస్, న్యూస్ అప్ డేట్స్, తెలుగు వార్తలు, తెలుగు న్యూస్, న్యూస్ అప్ డేట్, బ్రేకింగ్ న్యూస్, వైరల్ న్యూస్,
ఉద్దవ్ థాకరే, ఆదిత్య థాకరే


ఢిల్లీ కాంగ్రెస్ ప్రాభవం లేదు..ఎండిపోయిన కొలనులో కమల వికసించాలని బీజేపీ ఆశిస్తోంది..ఐదేళ్ల పనితీరు ఆధారంగా కేజ్రీవాల్ ఓట్లు అడుగుతన్నారు..ఇది దేశ రాజకీయాల్లో సరికొత్త రాజకీయ ప్రయోగం..దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉందని సామ్నా సంపాదకీయం పేర్కొంది.




కేజ్రీవాలు అభిప్రాయాలు, ఆయన పనిచేసే విధానంలో కొంత వైరుధ్యం ఉన్నా..కేంద్రం ఎన్ని అడ్డంకులు సృష్టించినా తన పరిధిలో తక్కువ అధికారాలే ఉన్నా...ప్రజారోగ్యం, విద్య, స్థానిక వసతుల రంగాల్లో కేజ్రీవాల్ మెరుగైన పాలన అందించారని కొనియాడింది. కేజ్రీవాల్ అందరికంటే బలమైన వ్యక్తి...ఢిల్లీ ఓటర్లు చాలా పరిపక్వత చెందిన వారు..వారికి తాము ఎలాంటి సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని పేర్కొంది.

ఢిల్లీ అసెంబ్లీకి శనివారం(ఫిబ్రవరి 8) పోలింగ్ జరగనుండగా...ఈ నెల 11న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
First published: February 7, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు