ఢిల్లీ ఎన్నికలపై ఓపీనియన్ పోల్ సర్వే.. ఎవరికి ఎన్ని సీట్లంటే..?

హస్తినలో ఆమాద్మీనే మరోసారి అధికారం చేపడుతుందని ఈ సర్వే తేల్చింది. ఢిల్లీలో వార్ వన్ సైడ్ అని.. కేజ్రీవాల్ చీపురు ప్రత్యర్థులను ఊడ్చేస్తుందని జోస్యం చెప్పింది.


Updated: February 4, 2020, 5:31 PM IST
ఢిల్లీ ఎన్నికలపై ఓపీనియన్ పోల్ సర్వే.. ఎవరికి ఎన్ని సీట్లంటే..?
ఢిల్లీ ఎన్నికల ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఢిల్లీలో ఎన్నికల ప్రచారం హీటెక్కింది. బీజేపీ, ఆమాద్మీ, కాంగ్రెస్ పార్టీల నేతలు పోటాపోటీగా ప్రచారం చేస్తున్నారు. మరి ఢిల్లీ పీఠం ఎవరిని వరించబోతోందని దేశమంతటా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఢిల్లీ ఎన్నికలపై Times Now-IPSOS సంస్థలు ఒపీనియన్ పోల్ నిర్వహించాయి. హస్తినలో ఆమాద్మీనే మరోసారి అధికారం చేపడుతుందని ఈ సర్వే తేల్చింది. ఢిల్లీలో వార్ వన్ సైడ్ అని.. కేజ్రీవాల్ చీపురు ప్రత్యర్థులను ఊడ్చేస్తుందని జోస్యం చెప్పింది. ఢిల్లీ ప్రజలంతా సీఎం కేజ్రీవాల్‌పై మరోసారి విశ్వాసం చూపుతున్నారని వెల్లడించింది.

Times Now-IPSOS ఒపీనియన్ పోల్ ప్రకారం.. 2020 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమాద్మీ పార్టీకి 52శాతం ఓట్లు రావొచ్చు. ఇక కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఢిల్లీ ఎన్నికల్లో 34శాతం ఓట్లతో సరిపెట్టుకోనుంది. సీట్ల విషయానికొస్తే.. 70 సీట్లున్న ఢిల్లీ అసెంబ్లీలో ఆమాద్మీ పార్టీకి 54-60 స్థానాలు దక్కవచ్చని Times Now-IPSOS ఒపీనియన్ పోల్ వెల్లడించింది. ఇక బీజేపీ 10-14 సీట్లకు మాత్రమే పరిమితమవుతుందని వెల్లడించింది. 2015 ఎన్నికల్లో కేవలం 3 సీట్లే గెలిచిన బీజేపీ.. ఈసారి కాస్త పుంజుకుంటుందని అభిప్రాయపడింది. కాగా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 8న పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 11న ఫలితాలను ప్రకటిస్తారు.First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు