‘త్వరలో అసద్ హనుమాన్ చాలీసా పటిస్తారు’..బీజేపీ ఎంపీ

Delhi Assembly election 2020: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌లానే త్వరలో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా పటిస్తారంటూ బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: February 4, 2020, 2:38 PM IST
‘త్వరలో అసద్ హనుమాన్ చాలీసా పటిస్తారు’..బీజేపీ ఎంపీ
బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా(ఫైల్ ఫోటో)
  • Share this:
ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్‌లానే త్వరలోనే మజ్లీస్ పార్టీ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా పటిస్తారంటూ బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా వివాదాస్పద ట్వీట్ చేశారు. తాను హిందూ వ్యతిరేకికాదని, రోజూ హనుమాన్ చాలీసా పటిస్తానంటూ న్యూస్18 ఇండియా నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించడం తెలిసింది. ఈ సందర్భంగా హనుమాన్ చాలీసాను పటించారు కేజ్రీవాల్. దీన్ని తన ట్విట్టర్ ఖాతాలోనూ షేర్ చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందేందుకే కేజ్రీవాల్ హనుమాన్ చాలీసా పటిస్తున్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.

దీనిపై స్పందించిన కపిల్ మిశ్రా...ఓ వివాదాస్పదమైన ట్వీట్ చేశారు. ‘ఇప్పుడు అర్వింద్ కేజ్రీవాల్‌ హనుమాన్ చాలీసా పటించడం మొదలుపెట్టారు..త్వరలోనే అసదుద్దీన్ ఓవైసీ కూడా హనుమాన్ చాలీసా పటిస్తారు’ అని కామెంట్ చేశారు.  దేశ సమైక్య బలమో దీనికి కారణమని పేర్కొన్నారు. అందరూ కలిసికట్టుగా ఓటు వేయాలని...20% ఓటు బ్యాంకు కోసం చెత్త రాజకీయాలు చేసే వారికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో గతంలోనూ బీజేపీ ఎంపీ కపిల్ మిశ్రా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలను భారత్- పాకిస్థాన్ మధ్య పోరుగా అభివర్ణించారు. కపిల్ మిశ్రా వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ఉల్లంఘనగా పరిగణించిన ఎన్నికల సంఘం...ఆయన 48 గం.ల పాటు ఢిల్లీలో ఎన్నికల ప్రచారం నిర్వహించకుండా నిషేధం విదించింది. తాజాగా అసద్‌పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యలను ఎన్నికల కోడ్ ఉల్లంఘించడమేనని రాజకీయ ప్రత్యర్థులు ఆరోపిస్తున్నారు. బీజేపీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఈ నెల 8న నిర్వహించనున్నారు. ప్రచార ఘట్టం చివరి దశకు చేరడంతో రాజకీయ నేతలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నారు. వ్యక్తిగత దూషలకు దిగుతున్నారు. వీరిని కట్టడి చేయడం ఎన్నికల సంఘానికి కష్టతరంగా మారుతోంది.
First published: February 4, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు