మధుయాష్కీ చేతికి బొబ్బలు.. క్వారంటైన్ స్టాంప్‌లో హానికారక రసాయనం

క్వారంటైన్ స్టాంప్ కోసం వినియోగించిన ఇంకులో ఏదో తేడా ఉందని మధుయాష్కీ అనుమానించారు. వెంటనే విషయాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు.

news18-telugu
Updated: October 5, 2020, 8:55 PM IST
మధుయాష్కీ చేతికి బొబ్బలు.. క్వారంటైన్ స్టాంప్‌లో హానికారక రసాయనం
మధుయాష్కీ చేతికి బొబ్బలు
  • Share this:
విదేశాల నుంచి వచ్చే వారికి ఎయిర్‌పోర్టుల్లో క్వారంటైన్ స్టాంప్ వేస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం అమెరికా నుంచి ఢిల్లీ చేరుకున్న కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్‌కు చేదు అనుభవం ఎదురయింది. ఎయిర్‌పోర్టులో వేసిన క్వారంటైన్ స్టాంపుతో చేతిపై బొబ్బలు వచ్చాయి. చర్మంపై మంట పుట్టడంతో పాటు నల్లగా కమిలిపోవడంతో ఆయన కంగారు పడ్డారు. చిన్నదే కదా..అని మొదట నీటితో తడుపుకున్నారు. ఆ తర్వాత బొబ్బలు మరింతగా ఎక్కువయ్యాయి. ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు వెళ్లిన మధుయాష్కీ వైద్యులను సంప్రదించారు. గాయం మానేందుకు ఆయింట్‌మెంట్ రాసుకున్నారు. ఐతే ఆదివారం ఉదయం నాటికి మంట తగ్గినప్పటికీ.. బొబ్బలు మాత్రం తగ్గలేదు.

క్వారంటైన్ స్టాంప్ కోసం వినియోగించిన ఇంకులో ఏదో తేడా ఉందని మధుయాష్కీ అనుమానించారు. వెంటనే విషయాన్ని కేంద్ర విమానయానశాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి దృష్టికి ట్విటర్ ద్వారా తీసుకెళ్లారు. తన చేతి అయిన గాయం ఫొటోలను కూడా అటాచ్ చేశారు. స్టాంప్‌లో వాడని రసాయనాలపై పరిశీలించాలని విజ్ఞప్తిచేశారు.


మధుయాష్కీ ట్వీట్‌పై కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ వెంటనే స్పందించారు. ఈ సమస్యను తన దృష్టికి తీసుకొచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. దీనిపై ఎయిర్‌పోర్ట్ అధారిటీ ఆఫ్ ఇండియా ఛైర్మన్‌తో మాట్లాడినట్లు పేర్కొన్నారు. తన ట్వీట్ పట్ల కేంద్రమంత్రి త్వరంగా స్పందించినందుకు.. ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు మధుయాష్కీ.

మధుయాష్కీ ట్వీట్‌పై ఢిల్లీ ఎయిర్‌పోర్ట్ అధికారులు కూడా స్పందించారు. జరిగినదానికి చింతిస్తున్నామని, క్వారంటైన్ స్టాంప్‌లో వాడిన సిరాను పక్కనపెడుతున్నామని చెప్పారు. ఈ విషయాన్ని ఢిల్లీ అధికారుల దృష్టికి తీసుకెళ్లామని పేర్కొన్నారు.

మధుయాష్కీకి మాత్రమే కాదు.. చాలా మందికి ఇలానే బొబ్బలు వచ్చాయి. మధుయాష్కీ ట్వీట్‌పై స్పందిస్తూ.. తమకూ ఇలాంటి అనుభవమే ఎదురయిందని నెటిజన్లు ట్వీట్ చేస్తున్నారు. ఒడిశాలోని జార్సుగూడ విమానాశ్రయం, నాగపూర్‌లో విమానాశ్రయాల్లో వేసిన స్టాంప్‌ల వల్ల తమకు బొబ్బలు వచ్చాయని కొందరు ఫొటోలను షేర్ చేశారు.




ఇంక్ సప్లై చేసిన సంస్థతో ఎయిర్ పోర్టు అధారిటీ అధికారులు మాట్లాడారు. ప్రస్తుతానికి ఆ సంస్థ నుంచి ఇంకును స్వీకరించడం లేదు.
Published by: Shiva Kumar Addula
First published: October 5, 2020, 8:38 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading