కారణాలు ఏమైనా మంత్రివర్గ విస్తరణకు ఇన్ని రోజులా?..ప్రొ.నాగేశ్వర్

కారణాలు ఏమైనా సుదీర్ఘకాలం పాటు రాష్ట్ర పాలనను ఇద్దరు మంత్రులే చూడడం సరికాదని, ఇది ప్రజాస్వామ్య సంప్రదాయాలకు పూర్తి విరుద్ధమని మాజీ ఎమ్మెల్సీ ప్రొఫసర్ కే. నాగేశ్వర్ పేర్కొన్నారు.

news18-telugu
Updated: January 4, 2019, 5:25 PM IST
కారణాలు ఏమైనా మంత్రివర్గ విస్తరణకు ఇన్ని రోజులా?..ప్రొ.నాగేశ్వర్
మాజీ ఎమ్మెల్సీ ప్రొ.కే.నాగేశ్వర్
  • Share this:
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న తీవ్ర జాప్యం సరైన ప్రజాస్వామిక సంప్రదాయం కాదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫసర్ కే.నాగేశ్వర్ అన్నారు. తెలంగాణ సీఎంగా కేసీఆర్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టి 20 రోజులు గడిచినా ఇప్పటి వరకు సీఎం కేసీఆర్‌తో పాటు హోం మంత్రి మెహముద్ అలీ మాత్రమే ప్రమాణస్వీకారం చేశారు. కేబినెట్ ప్రజాస్వామ్య వ్యవస్థలో సుదీర్ఘకాలం పాటు ఇద్దరు మంత్రులతో ప్రభుత్వాన్ని నడపడం సరైన సాంప్రదాయం కాదన్నారు.

మంత్రివర్గ విస్తరణలో జరుగుతున్న జాప్యానికి సీఎం కేసీఆర్ వ్యక్తిగత విశ్వాసాలే కారణమని ప్రచారం జరుగుతోందన్నారు. కేసీఆర్‌ వ్యక్తిగత విశ్వాసాలను మనం తప్పుబట్టడానికి వీలులేదన్నారు. అయితే ఆయన వ్యక్తిగత విశ్వాసాలు ప్రభుత్వ పాలనపై ప్రతికూల ప్రభావాన్ని చూపితే ప్రశ్నించాల్సి ఉంటుందన్నారు. కేబినెట్ విస్తరణ జాప్యం కావడానికి మంత్రివర్గ శాఖల ప్రక్షాళన, రాజకీయ కారణాలు, మరే ఇతర కారణమైనా...ఇన్ని రోజులు జాప్యం చేయడం సరైన ప్రజాస్వామిక సంప్రదాయం కాదన్నారు.

మంత్రివర్గ విస్తరణలో ముఖ్యమంత్రికి విచక్షణాధికారాలు ఉన్నా...ఇలా సాంప్రదాయ విరుద్ధంగా సుదీర్ఘకాలం పాటు మంత్రివర్గాన్ని విస్తరించకపోవడం సరికాదన్నారు. మంత్రివర్గ విస్తరణ తర్వాత కూడా మార్పులు చేర్పులు చేసేందుకు, పునర్‌వ్యవస్థీకరణ చేసుకోవచ్చన్నారు. ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మంత్రివర్గ విస్తరణ చేపట్టాలని కే.నాగేశ్వర్ సూచించారు.

First published: January 4, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>