బీజేపీతో దోస్తీ బీహార్ వరకే...బయట మీకు మీరే..మాకు మేమే...

40 సీట్లలో ఎన్డీయే పార్టీలు 39 సీట్లు గెలవడం విశేషం. వీటిలో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 సీట్లు సాధించాయి.

news18-telugu
Updated: June 9, 2019, 10:13 PM IST
బీజేపీతో దోస్తీ బీహార్ వరకే...బయట మీకు మీరే..మాకు మేమే...
మోదీ, నితీష్ (ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: June 9, 2019, 10:13 PM IST
బీజేపీ-జేడీయూ మిత్రబంధం అంత సాఫీగా సాగడం లేదు. మోదీ కేబినెట్‌లో జేడీయూకి ఒకే ఒక్క మంత్రి పదవి కేటాయిస్తామనడంతో నితీష్ కుమార్ అలకబూనారు. అందుకు ప్రతీకారంగా బీహార్ రాష్ట్ర కేబినెట్ విస్తరణలో బీజేపీకి ఒకే పదవి ఇవ్వజూపారు. దాంతో ఎన్డీయేలో లుకలుకలు మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఆదివారం జేడీయూ సంచలన నిర్ణయం తీసుకుంది. బీజేపీతో దోస్తీ బీహార్ వరకే పరిమితమని..బీహార్ బయట ఎవరి దారి వారిదేనని స్పష్టంచేసింది.

జేడీయూ బీహార్ బయటఎన్డీయే భాగస్వామి కాదు. రాబోయే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగానే బరిలోకి దిగుతాం. మా శక్తి మేర ఢిల్లీ, హర్యానా, జార్ఖండ్, జమ్మూకాశ్మీర్ ఎన్నికల్లో సొంతంగానే పోటీచేస్తాం. బీహార్, అరుణాల్ ప్రదేశ్‌లో జేడీయూ గుర్తింపు పొందిన పార్టీ. 2020 లోపు జేడీయూని జాతీయ పార్టీగా చూడాలన్నదే మా కోరిక.
కేసీ త్యాగి, జేడీయూ నేత
లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీయూ-ఎల్జేపీ పార్టీలు కలిసి పోటీచేశాయి. మొత్తం 40 స్థానాల్లో బీజేపీ 17, జేడీయూ 17, ఎల్జేపీ 6 స్థానాల్లో బరిలో దిగాయి. 40 సీట్లలో ఎన్డీయే పార్టీలు 39 సీట్లు గెలవడం విశేషం. వీటిలో బీజేపీ 17, జేడీయూ 16, ఎల్జేపీ 6 సీట్లు సాధించాయి. ఒకే ఒక్క స్థానంలో కాంగ్రెస్ విజయం సాధించింది.
First published: June 9, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...