Home /News /politics /

DAY TWO NIA SEARCHING CONTINUE IN VISKAHAPATNA PUBLIC ASSOCIATIONS SLAMS TO CENTRAL GOVERNMENT NGS

VisakhaPatnam: తెలుగు రాష్ట్రాల్లో ఎన్ఏఐ దూకుడు: విశాఖ ఉద్యమాన్ని అణిచివేయడానికే? ఉపా చట్టాన్ని రద్దు చేయాలని ప్రజా సంఘాల డిమాండ్

విశాఖ ఉద్యమాన్ని అణిచివేయడానికి సోదాలు అంటూ ప్రజా సంఘాల మండిపాటు

విశాఖ ఉద్యమాన్ని అణిచివేయడానికి సోదాలు అంటూ ప్రజా సంఘాల మండిపాటు

రెండు తెలుగు రాష్ట్రాలో ఎన్ఐఏ సోదాలతో ఏం జరుగుతోందో అనే అలజడి రేగింది. న్యాయవాధులు, ప్రజా సంఘాల నేతలు, జర్నలిస్టుల ఇళ్లపై రెండు రాష్ట్రాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ప్రజాసమస్యలపై గళం ఎత్తకుండా ఉండేందుకే కేంద్రం ఈ సోదాలు చేస్తోందని ప్రజా సంఘాలు మండిపడుతున్నాయి.

ఇంకా చదవండి ...
  తెలుగు రాష్ట్రాలో సోదాలతో జాతీయ దర్యాప్తు సంస్త ఎన్ఏఐ దూకుడు పెంచింది. మంచంగిపుట్ట కేసును విచారణకు తీసుకున్న ఎన్ఏఐ తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి సోదాలు కొనసాగిస్తోంది. ఈ కేసులో కీలక నిందితునిగా ఉన్న నాగన్న ఇచ్చిన సమాచారంతో ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్‌ఐఏ బృందం సాయంత్రం నుంచి తనిఖీలు చేస్తూనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజాసంఘాల నేతలు, పలువురు న్యాయవాదుల ఇళ్లలో స్థానిక పోలీసుల సహకారంతో భారీఎత్తున సోదాలు చేపట్టింది. పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వేడంగి చిట్టిబాబును ఎన్‌ఐఏ బృందం బుధవారం రాత్రి అదుపులోకి తీసుకుంది. తూర్పు గోదావరిజిల్లా రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో నిర్బంధించి విచారిస్తున్నట్లు సమాచారం.

  గుంటూరు జిల్లా సత్తెనపల్లిలోని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్‌ ఇంట్లోనూ పోలీసులు సోదాలు చేశారు. తనిఖీల సమయంలో చంద్రశేఖర్‌ ఇంట్లో లేనట్టు తెలుస్తోంది. చంద్రశేఖర్‌పై విశాఖ జిల్లా మంచింగ్‌పుట్ట పోలీసు స్టేషన్‌లో, పిడుగురాళ్ల పోలీసు స్టేషన్‌లో ఇటీవలే రెండు కేసులు నమోదు అయ్యాయి. ఆయా కేసుల్లో ఆయనపై నిర్బంధ చర్యలు తీసుకోవద్దని హైకోర్టు రెండు నెలల కిందటే బెయిల్‌ ఉత్తర్వులు ఇచ్చింది. తాడేపల్లిలో ఉంటున్న ఏపీ ప్రగతి శీల మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు రాజేశ్వరి అలియాస్‌ రాజి నివాసంలో సోదాలు నిర్వహించారు. విశాఖ నగరంలో న్యాయవాది కె.పద్మ, చినవాల్తేరులోని కేఎస్‌ చలం ఇళ్లలో వేర్వేరుగా సోదాలు నిర్వహించారు.

  కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన విరసం మాజీ రాష్ట్ర కార్యదర్శి వరలక్ష్మి నివాసంలో ఎన్‌ఐఏ అధికారుల బృందం సోదాలు నిర్వహించింది. నాలుగు గంటలకుపైగా అధికారులు వరలక్ష్మిని విచారించినట్లు తెలిసింది. ప్రకాశం జిల్లా ఆలకూరపాడు గ్రామంలో నివాసముంటున్న మావోయిస్టు అగ్రనేత ఆర్కే సహచరి పద్మ నివాసంలోనూ ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్నూలు జిల్లాకు చెందిన ప్రముఖ విప్లవ రచయిత పినాకపాణి ఇంట్లో ఎన్‌ఐఏ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కేరళకు చెందిన ఎన్‌ఐఏ డీఎస్పీ సాజీమూన్‌ ఆధ్వర్యంలోని బృందం స్థానిక త్రీటౌన్‌ పోలీసుల సాయంతో తనిఖీలు చేస్తోంది.

  హైదరాబాద్‌కు చెందిన న్యాయవాది వి. రఘునాథ్‌ ఇంట్లో కూడా సోదాలు నిర్వహించినట్లు తెలిసింది. మంచంగిపుట్ట, పిడుగురాళ్ల కేసులను కొట్టివేయాలంటూ ప్రజాసంఘాల తరఫున అడ్వకేట్‌ రఘునాథ్‌ వాదిస్తున్నారు. ఈ సోదాలపై ప్రజాసంఘాల నేతలు తీవ్రంగా స్పందించారు. ఏప్రిల్‌ 10, 11 తేదీల్లో విజయవాడలో విరసం సాహిత్య సమావేశాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంపై ఇటు ఎస్ఐబీ, అటు ఎన్‌ఐఏ దృష్టి పెట్టాయి.

  విశాఖలో కూడా ఎన్ఐఏ సోదాలు రెండో రోజు కొనసాగుతున్నాయి.  ప్రజా సంఘాల నేతల ఇళ్లల్లో ఎన్ఐఏ అధికారులు, పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. అయితే విశాఖ పిఠాపురం కాలనీలోని న్యాయవాది కె. పద్మ ఇంట్లో సోదాలు ముగిసాయి. ఆమె నివాసం నుంచి హార్డ్ డిస్క్ లు, డాక్యుమెంట్లు, సెల్ ఫోన్ లు స్వాధీనం చేసుకున్నారు. అయితే కె ఎస్ చలం ఇంట్లో ఇంకా ఎన్ఏఐ సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ సోదాలను పౌర, ప్రజా సంఘాల నేతలు ఖండించారు. ఉపా చట్ట రద్దు పోరాట కమిటీ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఆందోళనకు దిగింది. వెంటనే ఉపా చట్టాన్ని రద్దు చెయ్యాలని డిమాండ్ చేశాయి. విశాఖలో ప్రజా సంఘాల నాయకుల ఇళ్లపై దాడులు చేయడం దారుణమని వారు మండిపడ్డారు. ఉపా కేస్ లపై కోర్టును ఆశ్రయించామని.. కోర్టు నుంచి రిలీఫ్ ఆర్డర్ కూడా ఉంది. అయినా కోర్టు ఆర్డర్ ను ధిక్కరిస్తూ ఎన్ఐఏ సోదాలు చేయడం సరైంది కాదన్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తున్న ప్రజా నాయకుల పై ఉపా చట్టం కింద కేసులు పెడితే.. ప్రజల తరుపున పోరాడేది ఎవరని ప్రశ్నించారు. విశాఖలో జరుగుతున్న స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో పాల్గొననివ్వకుండా చేయడానికి ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
  Published by:Nagesh Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Crime, Crime news, NIA, Visakha, Visakhapatnam, Vizag, Vizag Steel Plant

  తదుపరి వార్తలు