అదే కేసీఆర్ కుట్ర.. టీడీపీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చారు : చంద్రబాబు

Chandrababu Naidu on Data Breach Case : టీడీపీ డేటానే కొట్టేసి టీడీపీ పైనే కేసులు పెడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు. కేసీఆర్, జగన్ .. తమ ముసుగు తీసేసి ప్రచారం చేస్తే ప్రజలే వారికి బుద్ది చెబుతారని అన్నారు. ఓటమి ఓటమి భయంతోనే జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు.

news18-telugu
Updated: March 5, 2019, 11:27 AM IST
అదే కేసీఆర్ కుట్ర.. టీడీపీ డేటాను దొంగిలించి వైసీపీకి ఇచ్చారు : చంద్రబాబు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు(File)
  • Share this:
జగన్ కేసీఆర్‌కు సామంత రాజుగా మారారని, ఆంధ్రప్రదేశ్‌ని సామంత రాజ్యం చేయాలనేదే కేసీఆర్‌ కుట్ర అని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జగన్‌ను లొంగదీసుకుని తెలంగాణ ప్రభుత్వం ఏపీపై దాడులకు తెగబడిందని మండిపడ్డారు. అధికారం ఉంది కదా అని అహంభావంతో వ్యవహరిస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. వైసీపీ తీరుకు నిరసనగా బుధవారం రాష్ట్రమంతా ర్యాలీలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం టీడీపీ నేతలతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్‌లో సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు.

అహంభావంతో కేసీఆర్‌, అసహనంతో జగన్ దుర్మార్గాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఏ పార్టీకి లేని టెక్నాలజీ టీడీపీ సొంతమని.. అలాంటి పార్టీ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడమే గాక హద్దులు దాటి వ్యవహరిస్తున్నారని కేసీఆర్, జగన్‌లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 24ఏళ్లు శ్రమించి టీడీపీ తమ కార్యకర్తల డేటాను సేకరించిందని.. ఇప్పుడు ఆ డేటాను దొంగిలించి వైసీపీ చేతుల్లో పెట్టారని ఆరోపించారు. టీడీపీ డేటాను పట్టుకుని ప్రభుత్వ సమాచారం అని అసత్యాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.


టీడీపీ డేటానే కొట్టేసి టీడీపీ పైనే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. కేసీఆర్, జగన్ .. తమ ముసుగు తీసేసి ప్రచారం చేస్తే ప్రజలే వారికి బుద్ది చెబుతారని అన్నారు. ఓటమి భయంతోనే జగన్ అరాచకాలకు పాల్పడుతున్నారని చంద్రబాబు విమర్శించారు. ఓవైపు ఓట్ల తొలగింపు, మరోవైపు ఎన్టీఆర్ విగ్రహాలను ధ్వంసం చేస్తున్న వైసీపీ తీరును నేతలంతా తీవ్రంగా ఎండగట్టాలని పిలుపునిచ్చారు.

ఇది కూడా చదవండి : డేటా చోరీ కేసులో చంద్రబాబు సర్కార్ చుట్టూ బిగుస్తోన్న ఉచ్చు..
First published: March 5, 2019, 11:24 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading