Data Breach: అశోక్ అమెరికాలో ఉన్నా.. అమరావతిలో ఉన్నా వదలం: స్టీఫెన్ రవీంద్ర

ఐటీ గ్రిడ్‌లో తెలంగాణ ప్రజల డేటా కూడా ఉందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తెలంగాణ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ ఎందుకోసం వాడుకుందో తెలుసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు.

news18-telugu
Updated: March 7, 2019, 5:56 PM IST
Data Breach: అశోక్ అమెరికాలో ఉన్నా.. అమరావతిలో ఉన్నా వదలం: స్టీఫెన్ రవీంద్ర
డేటా చోరీ కేసులో ఏర్పాటైన సిట్ చీఫ్ స్టీఫెన్ రవీంద్ర (File)
  • Share this:
డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్‌కు చెందిన అశోక్ ఎక్కడున్నా వదిలిపెట్టబోమని ఈ కేసుపై ఏర్పాటైన సిట్ అధిపతి స్టీఫెన్ రవీంద్ర స్పష్టం చేశారు. అశోక్ అమెరికాలో ఉన్నా.. అమరావతిలో ఉన్నా కూడా వదిలిపెట్టబోమన్నారు. ఐటీ గ్రిడ్‌లో తెలంగాణ ప్రజల డేటా కూడా ఉందని స్టీఫెన్ రవీంద్ర తెలిపారు. తెలంగాణ ప్రజల డేటాను ఐటీ గ్రిడ్ ఎందుకోసం వాడుకుందో తెలుసుకుంటామని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. డేటా చోరీ కేసు సైబరాబాద్, హైదరాబాద్ పరిధిలో కేసులు ఉండడంతో అన్ని కలిపి విచారించేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. స్టీఫెన్ రవీంద్ర నేతృత్వంలో 9మందితో సిట్ ఏర్పాటైంది. ఈ కేసులో ఇప్పటి వరకు జరిగిన విచారణను పరిశీలించినట్టు స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. ఈ కేసును విచారించేందుకు సాంకేతిక నిపుణుల అవసరం కూడా ఉందని స్టీఫెన్ రవీంద్ర చెప్పారు. వీలైనంత త్వరగా కేసు విచారణను జరిపి కోర్టుకు నివేదిక అందిస్తామన్నారు. అత్యంత నిష్పాక్షికంగా కేసు విచారణ జరుపుతామని ఆయన స్పష్టం చేశారు.
First published: March 7, 2019, 5:56 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading