Dalitha Bandhu: వాసాల‌మ‌ర్రి గ్రామానికి దళిత బంధు నిధులు మంజూరు.. ఎన్ని రూ. కోట్లంటే..

సీఎం కేసీఆర్ కు అభివాదం చేస్తున్న వృద్దురాలు

Dalitha Bandhu: ద‌త్త‌త గ్రామం వాసాల‌మ‌ర్రి ద‌ళితుల‌కు ఇచ్చిన మాట‌ను ముఖ్య‌మంత్రి కేసీఆర్ నిల‌బెట్టుకున్నారు. నిన్న ఇచ్చిన హామీ మేర‌కు గురువారం ఆ గ్రామానికి ద‌ళిత బంధు నిధుల‌ను విడుద‌ల చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని తన దత్తత గ్రామం వాసాలమర్రికి దళితబంధు నిధులు విడుదల చేశారు. దళితబంధు అమలుపై ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు ఈ పథకం అమలు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఒక్కో కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున వాసాలమర్రివాసులకు దళితబంధు పథకం తొలి ప్రయోజనం అందనుంది. మొత్తం గ్రామంలో 76 దళిత కుటుంబాలు ఉండగా వారికి రూ.7.60 కోట్లు విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీంతో వాసాల మర్రి గ్రామలో ఆనందహేళలు మొదలయ్యాయి. టపాసులు కాలుస్తూ సంబరాలు చేసుకుంటున్నారు. దీనికి సంబంధించి జీవో కూడా జారీ కావడంతో గ్రామంలో డప్పులు కొడుతూ.. మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేస్తున్నారు. దీంతో వాసాలమర్రిలో బతుకమ్మ పండుగ ముందే వచ్చింది. మహిళలు బతుకమ్మ ఆడుతూ అందులోనే మునిగి తేలుతున్నారు.  ఇచ్చిన మాట సీఎం నిలబెట్టుకున్నందుకు కేసీఆర్ కు గ్రామస్తులు కృతజ్ణతలు తెలియజేశారు.  త‌మ‌పై ద‌య చూపిన కేసీఆర్‌కు రుణ‌ప‌డి ఉంటామ‌ని పేర్కొన్నారు.  బుధవారం సీఎం కేసీఆర్ వాసలమర్రి పర్యటించి వారి పరిస్థితులు కళ్లారా చూసి చలించిపోయారు. దీంతో అప్పటికప్పుడే నిర్ణయించుకుని దళిత బంధు తొలిగా వాసాలమర్రికే అందించాలని ఆదేశాలు ఇచ్చారు.

    వాసాలమర్రి బంగారు వాసాలమర్రిగా కావాలని బుధవారం కేసీఆర్ అన్నారు. మొత్తం రాష్ట్రంలో మీరే మొదటి బిడ్డలు. దళితబంధు మీ దగ్గర లాంచ్‌ అయిపోయింది. దళితబంధు హుజురాబాద్‌లో అయ్యేది లాంఛనమే అని సీఎం కేసీఆర్  బుధవారం పేర్కొన్నారు.  ఈ మేరకు గురువారం ఎస్సీ అభివృద్ధి శాఖ నిధులు విడుదల చేసింది. సీఎం  ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండటంతో గ్రమస్తులంతో ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: