గోళ్లు పీకి.. గ్యాంగ్ రేప్.. మహిళపై పోలీసుల క్రౌర్యం

లాఠీలతో తీవ్రంగా కొట్టి, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆమె చేతివేళ్ల గోళ్లు పీకేశారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు చురు ఎస్పీ రాజేంద్ర కుమార్ శర్మను విధుల నుంచి తొలగించారు.

news18-telugu
Updated: July 15, 2019, 8:46 AM IST
గోళ్లు పీకి.. గ్యాంగ్ రేప్.. మహిళపై పోలీసుల క్రౌర్యం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
దొంగతనం కేసులో అరెస్టయిన ఓ యువకుడు పోలీసుల కస్టడీలో చనిపోయాడు.కేసు విచారణ నిమిత్తం అతని వదినను కూడా విచారణకు తీసుకెళ్లారు పోలీసులు.అక్కడ ఆమెను చిత్రహింసలకు గురిచేశారు. గోళ్లు ఊడబీకారు.. లాఠీలతో తీవ్రంగా గాయపరిచారు. ఆమె కళ్లు కూడా
తెరవలేనంతగా నరకం చూపించారు. ఆమెపై గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు.రాజస్థాన్‌లో సంచలనం రేపిన ఈ ఘటనలో బాధితురాలిని దళిత మహిళగా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌లోని చురులో ఓ దొంగతనం కేసులో జులై 30న 22 ఏళ్ల యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత రెండు రోజులకు అతన్ని విడిచిపెట్టారు. జులై 3న, మళ్లీ అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈసారి అతని వదిన(35)ను కూడా పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. జులై 6వ తేదీ రాత్రి అతను కస్టడీలోనే మృతి చెందాడు. ఆ తర్వాత కూడా అతని వదినను పోలీసులు వదిలిపెట్టలేదు.జులై 10వ తేదీ వరకు ఆమెను కస్టడీలోనే ఉంచి చిత్రహింసలు పెట్టుకున్నారు. లాఠీలతో తీవ్రంగా కొట్టి, గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. ఆమె చేతివేళ్ల గోళ్లు పీకేశారు.ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన ఉన్నతాధికారులు చురు ఎస్పీ రాజేంద్ర కుమార్ శర్మను విధుల నుంచి తొలగించారు. అలాగే ఆరుగురు కానిస్టేబుల్స్,స్టేషన్ హౌజ్ ఆఫీసర్స్‌ను కూడా తొలగించారు.ప్రస్తుతం బాధితురాలు ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. క్రైమ్ బ్రాంచ్ పోలీసులు దీనిపై

విచారణ జరుపుతున్నారు.
First published: July 15, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>