DALIT WOMAN COMPLAINT ON TDP LEADERS YANAMALA RAMAKRISHNUDU AND CHINA RAJAPPA BA
మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రులకు షాక్...
అప్పట్లో ఎంపీలు పార్లమెంట్లో చేసిన పోరాటాన్ని స్పూర్తిగా తీసుకోవాలని ఆయన పార్టీ నేతలకు చెప్పినట్టు సమాచారం. అయితే అమరావతి విషయంలో చంద్రబాబు వ్యూహాన్ని అమలు చేసేందుకు టీడీపీ నేతలు అంత సుముఖంగా లేరనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన రోజే మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల మీద ఓ ఫిర్యాదు చేసింది ఓ దళిత మహిళ.
టీడీపీ నేత, మాజీ మంత్రి అచ్చెన్నాయుడును అరెస్ట్ చేసిన రోజే మరో ఇద్దరు టీడీపీ మాజీ మంత్రుల మీద ఓ ఫిర్యాదు వచ్చింది. అయితే, అది ఈఎస్ఐ స్కాంకి సంబంధించింది కాదు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన టీడీపీ నేతలు, చంద్రబాబు హయాంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన చినరాజప్ప, ఆర్థిక మంత్రిగా పనిచేసిన యనమల రామకృష్ణుడు మీద ఫిర్యాదు చేసింది. ఓ దళిత యువతి వారిద్దరిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసింది. తన భర్తకు రెండో వివాహం చేయించేందుకు యనమల, చినరాజప్ప ప్రయత్నించారని ఆరోపించింది. కాకినాడ రూరల్ మాజీ టీడీపీ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మీ కుమారుడు రాధకృష్ణతో తొమ్మిదేళ్ళ క్రిందట ప్రేమ వివాహం చేసుకుంది మంజు ప్రియ. వారికి ఇద్దరు పిల్లలు. గత కొంత కాలంగా భర్తని కాపురానికి పంపకుండా వేధించడంతో మార్చి 10న ఇంద్రపాలెం పోలీసు స్టేషన్ లో అత్తమామలపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీనిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు.
నిన్న తెల్లవారుజామున రాధాకృష్ణకు రెండో వివాహం చేసేందుకు తల్లిదండ్రులు ఏర్పాట్లు చేశారు. యనమల స్వగ్రామమైన ఎవీ నగరంలో వివాహ ఏర్పాట్లు చేశారు. ఆ వివాహనికి యనమల, చినరాజప్ప కూడా హాజరయ్యారు. భాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో ఆగిన రెండో వివాహం ఆగింది. తన అత్తమామల తో పాటుగా యనమల, చినరాజప్పలపై ఎస్పీకి ఫిర్యాదు చేసింది మంజు ప్రియ.
మంజు ప్రియ ఫిర్యాదుతో తుని నియోజకవర్గం తొండంగి పొలీసు స్టేషన్ లో ఏడుగురిపై (క్రైం. నెం: 230) ఎఫ్ఐఆర్ నమోదు అయింది.
A1.పిల్లి రాధకృష్ణ- భర్త
A2: పిల్లి సత్యనారాయణ-మావయ్య
A3. పిల్లి అనంతలక్ష్మీ-అత్త, మాజీ ఎమ్మెల్యే, కాకినాడ రూరల్
A4. యనమల కృష్ణుడు- అధ్యక్షుడు, టిడిపి, తుని నియోజకవర్గం
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.