అయోధ్య కేసులో నేటితో ముగియనున్న వాదనలు... సుప్రీం తీర్పుపై సస్పెన్స్

అయోధ్య కేసును మొదట్లో అక్టోబర్ 18 నాటికి ముగించాలని ధర్మాసనం భావించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 17కు జరిపారు.

news18-telugu
Updated: October 16, 2019, 4:20 PM IST
అయోధ్య కేసులో నేటితో ముగియనున్న వాదనలు... సుప్రీం తీర్పుపై సస్పెన్స్
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: October 16, 2019, 4:20 PM IST
దేశమంతా ఎంతో ఆసక్తి కనబరుస్తున్న అయోధ్య కేసు విచారణ ఇవాల్టీతో ముగియనుంది. సుప్రీంకోర్టులో అయోధ్య కేసుపై గతకొంతకాలంగా విచారణ జరుగుతుంది. అయోధ్యలో రామజన్మభూమి-బాబ్రీ మసీదు వివాదం పై సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం జరుపుతున్న విచారణ ఇవాల్టితో ముగియనుంది. మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ వాదోపవాదనలను బుధవారంతో ముగిస్తామని సంకేతాలిచ్చారు. 40 రోజుల పాటు సుదీర్ఘంగా జరిగిన వాదోపవాదనలను పూర్తిగా పరిశీలించిన తర్వాత తీర్పును వెలువరించనున్నట్లు ఆయన తెలిపారు.

నవంబర్ 17వ తేదీన సీజేఐ రంజన్ గొగోయ్ పదవీ విరమణ చేయనున్నారు. ఆలోపే తీర్పు వెలువడే అవకాశం ఉంది. లేని పక్షంలో ఈ కేసును కొత్త ధర్మాసనం ముందు తిరిగి మొదటి నుంచి వివరించాల్సి వస్తుంది. గత 39 రోజులుగా సాగుతున్న అయోధ్య కేసును మొదట్లో అక్టోబర్ 18 నాటికి ముగించాలని ధర్మాసనం భావించింది. ఆ తర్వాత గడువును అక్టోబర్ 17కు జరిపారు. ఇక ఈ వివాదం పై ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రోజువారి విచారణ జరుపుతూ వస్తున్న విషయం తెలిసిందే.

అయోధ్య రామమందిర నిర్మానం, బాబ్రీ మసీదుకు దాఖలైన కేసులకు సంబంధించి 2001లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. వివాదాస్పద 2.7 ఎకరాల భూమిని సున్నీ వక్ఫ్‌బోర్డ్, నిర్మోహి అఖారా, రామలల్లా సంస్థలకు సమానంగా పంచాలని తీర్పులో పేర్కొంది. అయితే అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.

First published: October 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...