జగన్‌కు భారీ షాక్.. త్వరలో కీలక నేత గుడ్ బై..

న్యూస్‌18కి అందిన సమాచారం ప్రకారం.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్యతో కలసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు.

news18-telugu
Updated: October 13, 2019, 2:52 PM IST
జగన్‌కు భారీ షాక్.. త్వరలో కీలక నేత గుడ్ బై..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీకి త్వరలో ఓ కీలక నేత గుడ్ బై కొట్టనున్నారు. ఆ కీలక నేత ఎవరో కాదు. ఎన్టీఆర్ అల్లుడు, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఔను. న్యూస్‌18కి అందిన సమాచారం ప్రకారం.. దగ్గుబాటి వెంకటేశ్వరరావు తన భార్యతో కలసి ఢిల్లీలో బీజేపీ పెద్దలను కలిశారు. త్వరలో ఆయన వైసీపీకి రాజీనామా చేసి బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సంబంధించిన చర్చలు జరిపారు. ఓ మంచి ముహూర్తం చూసుకుని ఆయన కమలం కండువా కప్పుకోనున్నారు. వైసీపీ ప్రభుత్వం మీద పురందేశ్వరి విమర్శలు గుప్పిస్తున్నారు. అదే సమయంలో దగ్గుబాటి నుంచి ఎలాంటి రియాక్షన్స్ లేవు. పురందేశ్వరిని కూడా వైసీపీలోకి తీసుకురావాలని దగ్గుబాటికి వైసీపీలోని పెద్దలు సూచించినట్టు తెలిసింది. అయితే, జగన్ వద్ద చేరడం కంటే.. భార్యాభర్తలు ఇద్దరూ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో చేరడం మంచిదని భావించి ఈ నిర్ణయం తీసుకున్నారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు గతంలో బీజేపీలో పనిచేశారు.

ys jagan, ysrcDaggubati Purandeswari, Purandeswari to join YSRCP, Purandeswari Son, వైసీపీలోకి పురందేశ్వరి, వైసీపీలో చేరనున్న దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి పురందేశ్వరి కొడుకు పేరు,p, ys jagan lotus pond, daggubati venkateshwar rao with ys jagan, daggubati met ys jagan, daggubati purandareshwari, bjp daggubati purandareshwari, వైఎస్ జగన్, వైఎస్ఆర్‌సీపీ, వైఎస్ జగన్ లోటస్ పాండ్, వైఎస్ జగన్‌తో దగ్గుబాటి వెంకటేశ్వర్రావు , వైఎస్ జగన్‌ను కలిసిన దగ్గుబాటి, దగ్గుబాటి పురంధరేశ్వరి, బీజేపీ దగ్గుబాటి పురంధరేశ్వరి, దగ్గుబాటి హితేష్
వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో భేటీ అయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హితేష్ చెంచురాం (File)


గత ఎన్నికల్లో ప్రకాశం జిల్లా పర్చూరు నియోజకవర్గం నుంచి వైసీపీ తరఫున పోటీ చేసిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు నుంచి తన కొడుకు హితేష్ చెంచురాను బరిలో దించాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు ప్రయత్నించారు. అయితే, హితేష్ అమెరికా పౌరసత్వానికి సంబంధించిన సమస్య రావడంతో స్వయంగా వెంకటేశ్వరరావు బరిలోకి దిగారు. పోటీ చేసిన ప్రతి ఎన్నికల్లోనూ గెలిచిన రికార్డు ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావు.. జగన్ ప్రభంజనంలో కూడా ఓడిపోవడం విశేషం.

daggubati venkateswara rao, daggubati purandeswari, daggubati hitesh chenchuram, daggubati venkateswara rao meets YS Jagan, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి పురందేశ్వరి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైఎస్ జగన్‌తో భేటీ, దగ్గుబాటి హితేష్ చెంచురాం
దగ్గుబాటి పురందేశ్వరి, వెంకటేశ్వరరావు


మరోవైపు దగ్గుబాటిని పొమ్మనకుండా పొగబెట్టారనే ప్రచారం కూడా ఉంది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో పర్చూరు టికెట్ ఆశించి భంగపడిన రావి రామనాధంబాబును మళ్లీ వైసీపీలోకి ఆహ్వానించారు. ఆయనకు వైసీపీ టికెట్ దక్కకపోవడంతో ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిపోయారు. ఎన్నికల సమయంలో దగ్గుబాటి ఓటమికి బలంగా ప్రయత్నించారు. దగ్గుబాటిని ఓడించేందుకు తీవ్రంగా కృషి చేసిన వ్యక్తిని మళ్లీ పార్టీలోకి ఆహ్వానించడం అంటే పరోక్షంగా వదిలించుకోవడానికి చేస్తున్న ప్రయత్నమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఆర్టీసీ కార్మికుడి కడుపులో సీఐ పిడిగుద్దులు

Published by: Ashok Kumar Bonepalli
First published: October 13, 2019, 2:43 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading