టీడీపీలోకి దగ్గుబాటి ? చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా ?

ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నారు. అయితే చంద్రబాబు కుటుంబం మాత్రమే దీనికి ఒప్పుకోవడం లేదని సమాచారం.

news18-telugu
Updated: December 3, 2019, 8:52 AM IST
టీడీపీలోకి దగ్గుబాటి ? చంద్రబాబు ఛాన్స్ ఇస్తారా ?
చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వర్రావు
  • Share this:
దగ్గుబాటి వెంకటేశ్వరరావు పరిస్థితి ఏంటి ? బీజేపీలోకి వెళ్తారా ? టీడీపీలో చేరుతున్నారా ? మొత్తానికి రాజకీయాల్ని వదిలేస్తారా ? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో జరుగుతున్న ఆసక్తికర చర్చ ఇదే. వైసీపీ నుంచి బయటకు వచ్చేసిన దగ్గుబాటి ఏ పార్టీలో కూడా ఇంతవరకు చేరలేదు. ఆయన భార్య పురంధేశ్వరి బీజేపీలో ఉండటంతో... ఆయన కూడా కమలం చెంతకు చేరుతారని అంతా భావించారు. కానీ ఇప్పటివరకు అలా జరగలేదు. అయితే తాజాగా రాజకీయ వర్గాలతో పాటు సోషల్ మీడియాలో ఒక ప్రచారం జరుగుతోంది. ఆయన త్వరలోనే తెలుగుదేశం పార్టీలోకి వచ్చే అవకాశం ఉందని మంచి ముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారని చర్చలు కూడా పూర్తి అయ్యాయని మాట్లాడుకుంటున్నారు.

అయితే దగ్గుబాటి ఎంట్రీకి చంద్రబాబు కుటుంబం మాత్రం అంగీకరించలేదని సమాచారం. పురందరేశ్వరి బిజెపిలో ఉన్నా ఆ పార్టీకి రాష్ట్రంలో భవిష్యత్తు ఉందని చెప్పడం దాదాపుగా కష్టమే. దీంతో ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉండాలనే నిర్ణయాన్ని దగ్గుబాటి తీసుకుంటాని అంటున్నారు. అన్ని బాగుంటే తెలుగుదేశంలోకి వెళ్లాలని చూస్తున్నారని... అక్కడకు వెళ్ళడం సాధ్యం కాని పక్షంలో రాజకీయాలకు దూరంగా ఉండాలని ఆయన భావిస్తున్నారని సమాచారంజ

దగ్గుబాటి దంపతులు వేర్వేరు పార్టీల్లో ఉన్నందునే వారికి జగన్ ఓ సలహా ఇచ్చారు. ఉంటే ఇద్దరూ ఒకే పార్టీలో ఉండండి.. లేకపోతే వద్దని ఖరాఖండీగా చెప్పేశారు. దీంతో ఇప్పుడు వెంకటేశ్వరరావు టీడీపీలోకి వచ్చినా రేపు బీజేపీలో ఉండి పదవి కోసం కాచుకుని కూర్చొని ఉన్న పురందేశ్వరి టీడీపీపై విమర్శలు చేయక మానరు. దీంతో టీడీపీలో కూడా మళ్లీ వైసీపీలాంటి పరిస్థితే ఎదురవుతోంది. దీంతో దగ్గుబాటి ఏకంగా రాజకీయాలకే గుడ్ బై చెప్పాలనుకుంటన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

First published: December 3, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>