వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై... కీలక నేతకు ఫోన్ !

వైసీపీకి రాజీనామా చేయాలని దగ్గుబాటి వెంకటేశ్వరరావు నిర్ణయించుకున్నారు. దగ్గుబాటితో పాటు ఆయన కుమారుడు హితేష్ కూడా వైసీపీని వీడాలని డిసైడయ్యారు.

news18-telugu
Updated: October 28, 2019, 4:37 PM IST
వైసీపీకి దగ్గుబాటి గుడ్ బై... కీలక నేతకు ఫోన్ !
దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వైఎస్ జగన్
  • Share this:
వైసీపీలో కొనసాగే విషయంలో సస్పెన్స్ కొనసాగిస్తున్న సీనియర్ రాజకీయ నేత, చంద్రబాబు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావు... ఎట్టకేలకు ఆ పార్టీకి రాజీనామా చేశారు. దగ్గుబాటి వెంకటేశ్వరరావు, ఆయన కుమారుడు హితేష్ వైసీపీలో కొనసాగాలని భావిస్తే... బీజేపీలోని ఉన్న పురంధేశ్వరి కూడా పార్టీలోకి రావాలని సీఎం జగన్ దగ్గుబాటి కుటుంబానికి షరతు విధించినట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. దీనిపై కొంతకాలంగా ఎటూ తేల్చుకోలేకపోయిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు... ఎట్టకేలకు తానే వైసీపీని వీడాలని నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. తనకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల్లో తనకు వ్యతిరేకంగా పని చేసిన రఘునాథం బాబును తిరిగి పార్టీలోకి తీసుకోవడం దగ్గుబాటి అంసతృప్తికి కారణమైంది.

వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు ఆ పార్టీ ముఖ్యనేత విజయసాయిరెడ్డికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఫోన్ చేసి సమాచారం ఇచ్చినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. రాజీనామాల విషయంలో ప్రత్యేకంగా తాను ఎవరినీ కలవాలని అనుకోవడం లేదని ఆయన విజయసాయిరెడ్డికి చెప్పినట్టు తెలుస్తోంది. దగ్గుబాటి వెంకటేశ్వరరావుతో పాటు ఆయన తనయుడు హితేష్ కూడా వైసీపీకి రాజీనామా చేసినట్టు సమాచారం. మొత్తానికి దగ్గుబాటి వెంకటేశ్వరరావు వైసీపీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకోవడంతో... ఆయన సతీమణి పురంధేశ్వరి మరోసారి బీజేపీలో క్రియాశీలకంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది.

Published by: Kishore Akkaladevi
First published: October 28, 2019, 4:37 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading