ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే

ఫొని తుపాను ఎఫెక్ట్‌తో ఒడిశాలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 33కు చేరింది. ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే.

news18-telugu
Updated: May 6, 2019, 10:18 AM IST
ఒడిశాలో ప్రధాని మోదీ పర్యటన... తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
భువనేశ్వర్ ఎయిర్‌పోర్టులో మోదీకి స్వాగతం పలుకుతున్న ఒడిశాం సీఎం నవీన్ పట్నాయక్
  • Share this:
ఫొని తుఫాను సృష్టించిన బీభత్సంతో అతలాకుతలమైన ఒడిశా రాష్ట్రంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటిస్తున్నారు. కాసేపటి క్రితం భువనేశ్వర్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న మోదీకి  ఒడిశా సీెం నవీన్ పట్నాయక్ స్వాగతం పలికారు. తుఫాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రాంతాల్లో ఆయన ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కేంద్రం ఒడిశాకు రూ.వెయ్యికోట్ల సాయం కూడా ప్రకటించింది. ఫొని తుపాను ఎఫెక్ట్‌తో ఒడిశాలో చనిపోయిన వారి సంఖ్య ఇప్పటికే 33కు చేరింది. ఒడిశాలో ముందుజాగ్రత్త చర్యగా రైలు, విమాన సర్వీసులను నిలిపివేసిన విషయం తెలిసిందే. భువనేశ్వర్‌, కోల్‌కతా విమానాశ్రయాల్లో విమానాల రాకపోకలపై నిషేధం కొనసాగుతోంది. భువనేశ్వర్‌, పర్యాటక క్షేత్రం పూరీ రైల్వే స్టేషన్లు తీవ్ర గాలుల ధాటికి పూర్తిగా దెబ్బతిన్నాయి. పై కప్పులు ఎగిరిపోయాయి. ఇక వివిధ ప్రాంతాల్లో 34 సహాయక బృందాలు పునరావాస చర్యల్లో నిమగ్నమయ్యాయి. ఒడిశాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది.

రాష్ట్రవ్యాప్తంగా 5 వేల గ్రామాలు, 50 పట్టణాల రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. కోట్ల మంది నిరాశ్రయులయ్యారు. భారీ వర్షాలకు తోడు... గంటకు 200 కిలోమీటర్ల వేగంతో వీచిన గాలుల వల్ల వేల చెట్లు, కరెంటు స్తంభాలూ, సెల్ ఫోన్ టవర్లు నేలకూలాయి. రైలు, విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. ప్రస్తుతం 34 విపత్తు నిర్వహణ బృందాలు (NDRF) పునరావాస చర్యల్లో తలమునకలయ్యాయి.First published: May 6, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు