CWC MEETING UPDATES SONIA GANDHI TO REMAIN CONG INTERIM CHIEF FOR FEW MORE MONTHS SAY SOURCE SK
అప్పటి వరకు ఆమెనే.. కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగనున్న సోనియా
సోనియాగాంధీ(ఫైల్ ఫోటో)
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మీ రాహుల్ గాంధీని కోరారు. మరికొందరు నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగితే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని అభిప్రాయపడ్డారు.
సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఎన్నిక కొలిక్కి రాలేదు. వాడీవేడీగా జరిగిన సమావేశంలో నేతలూ ఎటూ నిర్ణయించుకోలేకపోయారు. ఈ క్రమంలో మరికొన్ని రోజుల పాటు సోనియా గాంధీనే తాత్కాలిక కాంగ్రెస్ అధ్యక్షురాలిగా కొనసాగనున్నట్లు సమాచారం. ఇవాళే సత్వర నిర్ణయం ఉండబోదని.. ఎన్నికకు కొంత సమయం పడుతుందని ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరికొన్నాళ్ల పాటు సోనియా గాంధే ఆ పదవిలో కొనసాగుతారని తెలిపాయి. మరో 6 నెలల్లో మళ్లీ సీడబ్ల్యూసీ సమావేశం జరుగుతుందని.. అప్పుడే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకుంటారని పేర్కొన్నాయి.
Sonia Gandhi to remain Congress party's interim president for now, new chief to be elected within next 6 months. Congress Working Committee (CWC) meeting has concluded after 7 hours: Sources
ఇవాళ వర్చువల్ విధానంలో సీడబ్ల్యూసీ సమావేశం జరిగింది. సోనియా గాంధీ, రాహుల్ గాంధీతో పాటు పార్టీ సీనియర్లంతా సమావేశానికి హాజరయ్యారు. ఐతే కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికతో పాటు సోనియాకు సీనియర్లు రాసిన లేఖపైనా హాట్ హాట్‌గా చర్చ జరిగింది. సమావేశం ప్రారంభమైన తర్వాత కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా రాజీనామా చేశారు. కొత్త అధ్యక్ష ఎన్నిక ప్రక్రియను ప్రారంభించాలని నేతలకు సూచించారు. ఐతే కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మీ రాహుల్ గాంధీని కోరారు. మరికొందరు నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగితే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఏకే ఆంటోని అభిప్రాయపడ్డారు.
ఇక పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి ఇటీవల 23 మంది నేతలు సోనియా గాంధీకు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని.. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు CWC సమావేశంలో తీవ్ర దుమారంరేపాయి. ఆ లేఖతో తన తల్లి ఎందో బాధపడిందని ఆయన అన్నారు. ఐతే రాహుల్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టారు.
తాను బీజేపీతో కుమ్మక్కయ్యామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్. అటు కపిల్ సిబల్ సైతం మొదట రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గడిచిన 30 ఏళ్లలో ఏనాడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని ట్వీట్ చేశారు. ఐతే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేసిన కాసేపటికే.. కపిల్ సిబాల్ తన ట్వీట్‌ను తొలగించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ చెప్పడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు. ఆ తర్వాత రాహుల్ గాంధీ సైతం.. బీజేపీతో కుమ్మక్కయ్యారని తాను ఎక్కడా అనలేదని అనడంతో పార్టీలో వివాదం సద్దుమణిగినట్లయింది.