కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది ఆయనేనా.. ఈ రచ్చకు కారణమేంటి?

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నలుగురు సీనియర్లు మధ్యలోనే లాగ్ ఔట్ అయినట్లు తెలుస్తోంది.

news18-telugu
Updated: August 24, 2020, 2:36 PM IST
కాంగ్రెస్‌లో చిచ్చు పెట్టింది ఆయనేనా.. ఈ రచ్చకు కారణమేంటి?
సోనియా, రాహుల్ గాంధీ
  • Share this:
కాంగ్రెస్ పార్టీలో నాయకత్వ సంక్షోభం రచ్చకు దారితీసింది. అధ్యక్ష పగ్గాల విషయంలో రాహుల్ గాంధీ, సీనియర్ల మధ్య విభేదాలు తారా స్థాయికి చేరాయి. ఇవాళ జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో కాంగ్రెస్ అంతర్గత పోరు మరోసారి రచ్చకెక్కింది. పార్టీలో నాయకత్వ మార్పునకు సంబంధించి ఇటీవల 23 మంది నేతలు సోనియా గాంధీకు లేఖ రాయడంపై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోనియా ఆస్పత్రిలో ఉన్న సమయంలో లేఖ ఎలా రాస్తారని.. బీజేపీతో కుమ్మక్కయ్యారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ చేసిన ఈ వ్యాఖ్యలు CWC సమావేశంలో తీవ్ర దుమారంరేపాయి. ఆ లేఖతో తన తల్లి ఎందో బాధపడిందని ఆయన అన్నారు. ఐతే రాహుల్ చేసిన వ్యాఖ్యలను సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, కపిల్ సిబల్ తప్పుబట్టారు.

తాను బీజేపీతో కుమ్మక్కయ్యామని నిరూపిస్తే రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు గులాం నబీ ఆజాద్. అటు కపిల్ సిబల్ సైతం మొదట రాహుల్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గడిచిన 30 ఏళ్లలో ఏనాడు బీజేపీకి అనుకూలంగా మాట్లాడలేదని ట్వీట్ చేశారు. ఐతే రాహుల్ గాంధీ అలాంటి వ్యాఖ్యలు చేయలేదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా ట్వీట్ చేసిన కాసేపటికే.. కపిల్ సిబాల్ తన ట్వీట్‌ను తొలగించారు. తాను ఆ వ్యాఖ్యలు చేయలేదని రాహుల్ గాంధీ చెప్పడంతో ఆ ట్వీట్‌ను డిలీట్ చేసినట్లు పేర్కొన్నారు.

అంతకుముందు కాంగ్రెస్ అధ్యక్ష పదవికి సోనియా గాంధీ రాజీనామా చేశారు. కొత్త అధ్యక్షడుడిని ఎన్నుకునే ప్రక్రియ ప్రారంభించాలని పార్టీ నేతలకు ఆమె విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పగ్గాలు చేపట్టాలని అహ్మద్ పటేల్, ఆనంద్ శర్మీ రాహుల్ గాంధీని కోరారు. మరికొందరు నేతలు సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సోనియా గాంధీ అధ్యక్ష పదవిలో కొనసాగితే బాగుంటుందని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అభిప్రాయపడ్డారు.

ఐతే కాంగ్రెస్ పార్టీలో ఈ రచ్చకు శశిథరూరే కారణమన్న ప్రచారం జరుగుతోంది. గాంధీయేతర నేతలకు అధ్యక్ష పదవి అప్పగిస్తే.. ఆ రేసులో శశి థరూర్ ముందు వరుసలో ఉన్నట్లు తెలిసింది. నాయకత్వ మార్పుకు సంబంధించి సోనియా గాంధీకి పార్టీ నేతలు రాసిన లేఖకు శశి థరూరే కారణమని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఐతే సీడబ్ల్యూసీ సమావేశంలో మాత్రం ఆయన ఒక్కమాట కూడా మాట్లాడకుండా.. సైలెంట్‌గా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతున్న ఈ సీడబ్ల్యూసీ సమావేశంలో కొందరు కాంగ్రెస్ నేతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. నలుగురు సీనియర్లు మధ్యలోనే లాగ్ ఔట్ అయినట్లు తెలుస్తోంది.
Published by: Shiva Kumar Addula
First published: August 24, 2020, 2:32 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading