మోదీ ఇలాకాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ... హాజరుకానున్న సోనియా, రాహుల్, ప్రియాంక

కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాన్నిగతంలో ఫిబ్రవరి 27న నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బాలాకోట్‌లో జరిగిన ఎయిర్ స్ట్రయిక్ నేపధ్యంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని వాయిదా వేశారు.

news18-telugu
Updated: March 12, 2019, 11:25 AM IST
మోదీ ఇలాకాలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ... హాజరుకానున్న సోనియా, రాహుల్, ప్రియాంక
సోనియా గాంధీ, రాహుల్, మన్మోహన్ సింగ్
  • Share this:
గుజరాత్ అహ్మాదాబాద్‌లో కాంగ్రెస్ వర్కింట్ కమిటీ మరికాసేపట్లో సమావేశం కానుంది. ప్రధాని మోదీ సొంత గడ్డైన గుజరాత్‌లో దాదాపుగా 58 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశం అవుతోంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ హాజరుకానున్నారు. తొలిసారిగా సీడబ్ల్యూసీ సమావేశానికి సెక్రటరీ హోదాలో ప్రియాంకగాంధీ హాజరవుతున్నారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని గుజరాత్ నుంచి మొదలు పెడుతున్న కాంగ్రెస్... ఈ భేటీలో లోక్‌సభ ఎన్నికల వ్యూహాలపై చర్చించనుంది. ఇప్పటికే సోనియా, రాహుల్, ప్రియాంక గుజరాత్‌ చేరుకున్నారు. ఉప్పు సత్యాగ్రహానికి 88 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సబర్మతి ఆశ్రమంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు.

మరోవైపు సీడబ్ల్యూసీ భేటీకి పాటీదార్ నేత హార్దిక్ పటేల్ హాజరు కానున్నారని తెలుస్తోంది. గతకొంతకాలంగా హార్దిక్ పటేల్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దానికి ఇప్పుడు మూహూర్తం నిర్ణయమైందని తెలుస్తోంది. హార్దిక్ పటేల్ జామ్‌నగర్ లోక్‌స‌భ సీటు నుంచి పోటీ చేయనున్నట్లు సమాచారం. గత గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో హార్దిక్ పటేల్ రాష్ట్ర రాజకీయాల్లో తనదైనముద్ర వేశారు.

అయితే కాంగ్రెస్ ఈ సమావేశాన్నిగతంలో ఫిబ్రవరి 27న నిర్వహించాలని నిర్ణయించింది. అయితే బాలాకోట్‌లో జరిగిన ఎయిర్ స్ట్రయిక్ నేపధ్యంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని వాయిదా వేశారు. ఈ రోజు జరగనున్న సమావేశంలో ముందుగా మహాత్మాగాంధీకి నివాళులు అర్పించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ ఈ భేటీలో ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. మొత్తం మీద లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కూడా దూకుడు పెంచింది.


First published: March 12, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు