త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం...కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఎంపిక

వచ్చే వారం సమావేశంకానున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఎన్నుకోనుంది.


Updated: July 28, 2019, 9:45 AM IST
త్వరలో సీడబ్ల్యూసీ సమావేశం...కాంగ్రెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఎంపిక
రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ (File)
  • Share this:
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) త్వరలోనే సమావేశమై పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిని ఎన్నుకోనుంది. కాంగ్రెస్ వర్గాల సమాచారం మేరకు పార్లమెంటు సమావేశాలు ముగిసిన వెంటనే సీడబ్ల్యూసీ సమావేశం జరిగే అవకాశముంది. వచ్చే వారం ఈ సమావేశం ఉండే అవకాశమున్నట్లు ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఆదివారం ఐఏఎన్ఎస్ వార్తా సంస్థకు తెలిపారు. మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ పరాభవానికి నైతిక బాధ్యతవహిస్తూ కాంగ్రెస్ అధ్యక్ష పదవి నుంచి రాహుల్ గాంధీ వైదొలగడం తెలిసిందే. పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేలా పలువురు పార్టీ నేతలు, మిత్రపక్షాల నేతలు బుజ్జగించినా రాహుల్ గాంధీ వెనక్కి తగ్గలేదు.

రాహుల్ గాంధీ స్థానంలో కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ పార్టీ సారథ్య పగ్గాలు చేపట్టాలని కొందరు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేయగా...తాను ఎట్టి పరిస్థితిలోనూ పార్టీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోనని ప్రియాంక గాంధీ తేల్చిచెప్పారు. దీంతో కొత్త సారధి ఎంపిక జఠిలంగా మారుతోంది. కొందరు సీనియర్ల పేర్లు తెరమీదకు వచ్చినా...పార్టీలో ఏకాభిప్రాయం లేకపోవడంతో కాంగ్రెస్ కొత్త సారథి ఎవరన్న అంశంపై సర్వత్రా ఆసక్తిరేపుతోంది.

కొత్త సారథి ఎంపిక కోసం ఆగస్టు మొదటివారంలో సీడబ్ల్యూసీ సమావేశాన్ని నిర్వహించాలని ముందుగా భావించగా...పార్లమెంటు సమావేశాలను మరో వారం పొడగించడంతో సీడబ్ల్యూసీ సమావేశాన్ని వచ్చే వారానికి వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది. సీడబ్ల్యూసీ సమావేశానికి రాహుల్ గాంధీ కూడా హాజరవుతారని, అయితే పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియలో ఆయనతో పాటు ప్రియాంక గాంధీ జోక్యం చేసుకోబోరని సమాచారం.
First published: July 28, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading