మహారాష్ట్ర, హర్యానాల్లో ఈనెల 21న అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే, ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనే కంటే... ఎన్నికల్లో ఏయే అంశాలు ఎక్కువ ప్రభావితం చేయబోతున్నాయి? ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటనే అంశంపై CVoter సంస్థ సర్వే నిర్వహించింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 16 అంశాలను ఓటర్ల ముందు ఉంచింది. అందులో నిరుద్యోగమే తమ ప్రధాన సమస్య అని 23.1శాతం మంది అభిప్రాయపడ్డారు. నీటి సరఫరా ప్రధాన సమస్యగా ఉందని 18.4 శాతం మంది తెలిపారు. రోడ్లు అధ్వానంగా ఉన్నాయని 14.1 శాతం మంది పేర్కొంటే.. రైతులు సమస్యలు ఎదుర్కొంటున్నారని 13.8 శాతం మంది చెప్పారు.
ఇక హర్యానా విషయానికి వస్తే.. అక్కడ కూడా నిరుద్యోగమే తమ ప్రధాన సమస్య అని 28.4 శాతం మంది అభిప్రాయపడ్డారు. స్థానికులకు ఉద్యోగాలు లభించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సరఫరా సరిగా లేదని 12.4 శాతం మంది, రోడ్లు బాగోలేవని 8.6శాతం మంది, కరెంటు సమస్యలు ఉన్నాయని 5.7శాతం మంది, ధరల పెరుగుదల ప్రధాన సమస్య అని 4.3 శాతం మంది అభిప్రాయపడ్డారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.