సీఎస్ అంటే చెవిరెడ్డి సెక్రటరీ.. టీడీపీ తీవ్ర ఆరోపణలు

చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని 25 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని అనురాధ ఆరోపించారు.

news18-telugu
Updated: May 17, 2019, 3:09 PM IST
సీఎస్ అంటే చెవిరెడ్డి సెక్రటరీ.. టీడీపీ తీవ్ర ఆరోపణలు
ఏపీ సీఎస్ఎల్వీ సుబ్రమణ్యం(ఫైల్ ఫోటో)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం మీద టీడీపీ మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. సీఎస్ అంటే చెవిరెడ్డి సెక్రటరీలా మారిపోయారంటూ టీడీపీ నేత పంచుమర్తి అనురాధ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చంద్రగిరి నియోజవకర్గంలో ఐదు చోట్ల రీ పోలింగ్ నిర్వహించాలని చెవిరెడ్డి కోరిన వెంటనే చీఫ్ సెక్రటరీ వాటిని ఎన్నికల కమిషన్‌కు సిఫారసు చేయడాన్ని ఆమె తప్పుపట్టారు. ఏప్రిల్ 11న రాష్ట్రంలో ఎన్నికలు ముగిస్తే.. ఆ తర్వాత ఐదు చోట్ల రీ పోలింగ్ జరిగిందని.. మళ్లీ నెల రోజుల తర్వాత మరోసారి రీ పోలింగ్ నిర్వహించడం ఏంటని ఆమె ప్రశ్నించారు. రెండు సార్లు రీ పోలింగ్ నిర్వహించడం ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. అదే చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ అభ్యర్థి పులవర్తి నాని 25 పోలింగ్ బూత్‌లలో రీ పోలింగ్ నిర్వహించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదని అనురాధ ఆరోపించారు. వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫిర్యాదు చేయగానే మాత్రం వెంటనే ఈసీ స్పందించి ఎన్నికలు పెట్టడాన్ని ఆమె తప్పుపట్టారు.

ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ఈనెల 19న చంద్రగిరి నియోజకవర్గంలోని కొత్త కండ్రిగ (బూత్ నెం.316), వెంకట్రామపురం (బూత్ నెం.313), కమ్మపల్లి (బూత్ నెం.318, బూత్ నెంబర్ 321), పులివర్తిపల్లి (బూత్ నెం.104)లో రీ పోలింగ్ జరగనుంది.

First published: May 17, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>