Elections Counting: కౌంటింగ్ పై ఎస్ఈసీ, సీఎస్ సమీక్ష... కలెక్టర్లకు కీలక ఆదేశాలు..

ఏపీ ఎస్ఈసీ నీలం సాహ్ని(ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో పరిషత్ ఎన్నికల కౌంటింగ్ (Parishath Elections Counting) కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కు హైకోర్టు (High Court) గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 19న నిర్వహించనున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఓట్ల (ZPTC, MPTC Elections) లెక్కింపు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commission) ప్రకటించిన సంగతి తెలిసిందే.

  • Share this:
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పరిషత్ ఎన్నికల కౌంటింగ్ (Parishath Elections Counting)కు సర్వం సిద్ధమైంది. కౌంటింగ్ కు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఈనెల 19న నిర్వహించనున్న జడ్పీటీసీ,ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ (State Election Commssion) ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎస్ఈసీ నీలం సాహ్నీ(SEC Neelam Sawhney) ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. సమావేశంలో పాల్గొన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ (CS Adithyanath Das) జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు,డిపిఓలు, జడ్పి సిఇఓలు, ఇతర ఉన్నతాధికారులకు కీలక ఆదేశాలిచ్చారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యా నాధ్ దాస్ మాట్లాడుతూ… ఈ నెల 19న నిర్వహించే జడ్పిటిసి, ఎంపిటిసి ఓట్ల లెక్కింపునకు సంబంధించి పలు మార్గదర్శకాలను ఇచ్చారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు కేంద్రాలలో కోవిడ్ నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని కలెక్టర్లు ఎస్పి లను ఆయన ఆదేశించారు.

    ఆలాగే ఓట్ల లెక్కింపు ప్రక్రియ సజావుగా జరిగేందుకు వీలుగా జిల్లా కలెక్టర్లు ఎస్పిలు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పారు. కౌంటింగ్ సిబ్బంది, కౌంటింగ్ ఏజెంట్లు తప్పని సరిగా వ్యాక్సిన్ వేయించుకుని ఉండాలని సిఎస్ కలెక్టర్లు కు స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఎస్పి లను సిఎస్ ఆదిత్యా నాధ్ దాస్ ఆదేశించారు. ప్రతి కౌంటింగ్ కేంద్రాల వద్ద ఏర్పాట్లను ఇతర ఏర్పాట్ల పర్యవేక్షణకు జిల్లా అధికారి ఒకరిని ఇన్ ఛార్జ్ గా నియమించాలని సీఎస్ కలెక్టర్లును ఆదేశించారు.  సమావేశంలో రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాల కృష్ణ ద్వివేది, పంచాయతీ రాజ్ శాఖ కమీషనర్ గిరిజా శంకర్, రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి కె.కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

    ఇది చదవండి: చంద్రబాబు ఇంటివద్ద టెన్షన్.. టెన్షన్.. జోగి రమేష్-బుద్ధా వెంకన్న బాహాబాహీ...



    రాష్ట్ర వ్యాప్తంగా 275 కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. కౌంటింగ్ లో 41 వేల మంది సిబ్బంది పాల్గొననున్నారు. ఏప్రిల్ 8న రాష్ట్రవ్యాప్తంగా 515 జడ్పీటీసీలు,7,220 ఎంపీటీసీ స్ధానాలకు ఎన్నికలు జరిగాయి. 126 జడ్పీటీసీలు, 2371 ఎంపీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. 515 జడ్పీటీసీ స్ధానాలకు 2058 మంది, 7220 ఎంపీటీసీలకు 18782 మంది పోటీ చేశారు. ఇప్పటికే 126 జడ్పీటీసీ స్ధానాలను వైసీపీ ఏకగ్రీవం చేసుకోగా.. పరిషత్ ఎన్నికలను టీడీపీ బాయ్ కాట్ చేసిన సంగతి తెలిసిందే..!

    ఇది చదవండి: శ్రీవారి బ్రహ్మోత్సవాలపై టీటీడీ కీలక ప్రకటన.. భక్తులకు నో ఎంట్రీ..!


    కాగా ఏప్రిల్ 8న రాష్ట్రంలో పరిషత్ ఎన్నికలు జరిగాయి. 10వ తేదీన ఓట్ల లెక్కింపు జరగాల్సి ఉంది. ఐతే ఎన్నికల ప్రక్రియ సరిగా లేదంటూ జనసేన, టీడీపీలు హైకోర్టులో పిటిషన్ వేశాయి. జనసేన పిటిషన్ ను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు సింగిల్ జడ్జి ధర్మాసనం.. ఎన్నికలను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. దీనిని ఎస్ఈసీతో పాటు పోటీ చేసిన అభ్యర్థులు కొందరు డివిజన్ బెంచ్ లో సవాల్ చేశారు. దీనిపై ఆగస్టు 5వ తేదీన విచారణ ముగిసిన కోర్టు.. సెప్టెంబర్ 16న సింగిల్ జడ్జి తీర్పును కొట్టివేస్తూ కౌంటింగ్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
    Published by:Purna Chandra
    First published: