హోమ్ /వార్తలు /National రాజకీయం /

ఏపీ ఎన్నికలు 2019 : ఆ లోక్‌సభ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్..?

ఏపీ ఎన్నికలు 2019 : ఆ లోక్‌సభ స్థానాల్లో క్రాస్ ఓటింగ్ ఎఫెక్ట్..?

Cross Voting Effect : ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొన్న సమయంలో ఓటర్లు వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ వేసే అవకాశముందని ముందునుంచీ అంతా భావించారు. కానీ ఎన్నికల సరళిని బట్టి చూస్తే కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

Cross Voting Effect : ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొన్న సమయంలో ఓటర్లు వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ వేసే అవకాశముందని ముందునుంచీ అంతా భావించారు. కానీ ఎన్నికల సరళిని బట్టి చూస్తే కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

Cross Voting Effect : ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొన్న సమయంలో ఓటర్లు వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ వేసే అవకాశముందని ముందునుంచీ అంతా భావించారు. కానీ ఎన్నికల సరళిని బట్టి చూస్తే కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది.

ఇంకా చదవండి ...

  (సయ్యద్ అహ్మద్, న్యూస్ 18 కరస్పాండెంట్, అమరావతి)

  ఏపీలో నిన్న జరిగిన పోలింగ్ హోరాహోరీగా సాగడంతో జనం ఏ పార్టీకి ఓటేశారన్న విషయంలో రాజకీయవర్గాల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది. రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఎవరికివారు తమదైన విశ్లేషణ చేసుకోవడం కనిపిస్తోంది. అన్ని రాజకీయపార్టీలు కూడా విజయం తమదేనన్న ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో న్యూస్ 18 క్షేత్రస్ధాయి పరిశీలనలో ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

  2009 ఎన్నికల ఫలితాలను ఓసారి గమనిస్తే అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంక్షేమ పథకాలను ఎంతో గొప్పగా అమలు చేశామని అప్పటి వైఎస్సార్ ప్రభుత్వం చెప్పుకున్నా.. ఆ మేరకు ఓట్లు సాధించడంలో మాత్రం విఫలమైంది. తమకు అత్తెసరు మార్కులు మాత్రమే వచ్చాయని స్వయంగా అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి నిష్కర్షగా చెప్పుకున్నారు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి అత్తెసరు మార్కులు వేసిన ఓటర్లు... ఎంపీలకు మాత్రం భారీ మెజారిటీ కట్టబెట్టారు. దీనికి కారణం భారీగా జరిగిన క్రాస్ ఓటింగే అన్నది జగమెరిగిన సత్యం. ఆ తర్వాత 2014లో క్రాస్ ఓటింగ్ జరగకపోవడంతో అసెంబ్లీ సీట్లు గెలుచుకున్న టీడీపీకే ఎంపీ సీట్లు కూడా భారీగా లభించాయి.

  ఈసారి ఎన్నికల్లో బహుముఖ పోటీ నెలకొన్న సమయంలో ఓటర్లు వివిధ కారణాలతో క్రాస్ ఓటింగ్ వేసే అవకాశముందని ముందునుంచీ అంతా భావించారు. కానీ ఎన్నికల సరళిని బట్టి చూస్తే కొన్ని చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తెలుస్తోంది. వీటిలో విశాఖ, విజయవాడ, శ్రీకాకుళం, నరసాపురంతో పాటు మిగతా చోట్ల క్రాస్ ఓటింగ్ జరిగినట్లు న్యూస్18 తాజా పరిశీలనలో తేలింది. విజయవాడ, శ్రీకాకుళంలో సిట్టింగ్ ఎంపీలపై సానుకూలత ఉండటంతో ఆయా స్ధానాల పరిధిలో ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్లు వైసీపీకి అనుకూలంగా ఉన్నా.. ఎంపీకి వచ్చే సరికి కేశినేని శ్రీనివాస్, రామ్మోహన్ నాయుడు గట్టెక్కే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  విశాఖ ఎంపీ స్ధానంలో జనసేన అభ్యర్ధిగా ఉన్న సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు నిర్ధారణ అయింది. ఎంపీ అభ్యర్ధుగా ఉన్న శ్రీ భరత్, పురంధేశ్వరి, ఎంవీవీ సత్యనారాయణతో పోలిస్తే లక్ష్మీనారాయణ మెరుగైన అభ్యర్ధిగా ఓటర్లు భావించినట్లు సమాచారం. విద్యావంతుడు, సీబీఐ అధికారిగా పలు కీలక కేసుల్లో అవినీతిపరుల భరతం పట్టడం వంటి అంశాలు లక్ష్మీనారాయణకు కలిసివచ్చినట్లు తెలిసింది. దీంతో టీడీపీ సాంప్రదాయ ఓట్లతో పాటు మార్పు కోరుకుంటున్న అర్బన్ ఓటర్లు, జనసేన తరుపున పవన్ అభిమానులు ఆయనకు ఓటేసినట్లు తెలిసింది.

  నరసాపురం పార్లమెంటు స్ధానం పరిధిలో ఉన్న అసెంబ్లీ స్ధానాల్లో మెజారిటీ కాపు ఓటర్లు వైసీపీ లేదా వైపు మొగ్గుచూపినా వీరంతా ఎంపీ స్ధానంలో మాత్రం పవన్ సోదరుడు నాగేంద్రబాబుకు అనుకూలంగా ఓటు వేసినట్లు తెలుస్తోంది. అలాగే గోదావరి జిల్లాల్లోనూ పలు అసెంబ్లీ స్ధానాల్లో జనసేనకు అనుకూలంగా ఓటు వేసిన వారు ఎంపీ స్ధానాల్లో మాత్రం వైసీపీ వైపు మొగ్గు చూపినట్లు తెలిసింది. రాష్ట్ర వ్యాప్తంగా మరికొన్ని చోట్ల సైలెంట్ ఓటింగ్ కారణంగా క్రాస్ ఓటింగ్ ప్రభావం ఉన్నా... దాని శాతం బాగా తక్కువగా ఉంటుందని సమాచారం.

  First published:

  Tags: Andhra Pradesh Assembly Election 2019, Andhra Pradesh Lok Sabha Elections 2019, Chandrababu Naidu, Lok Sabha Election 2019, Narasaraopet S01p14, Visakhapatnam S01p04, Ys jagan

  ఉత్తమ కథలు