ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. కోట్లు వృథా..?

ఏపీలో అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరుపై ప్రజలు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

news18-telugu
Updated: December 13, 2019, 11:13 AM IST
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు.. కోట్లు వృథా..?
ఏపీ అసెంబ్లీ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు గరం గరంగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష పార్టీలు వైసీపీ, టీడీపీ సభ్యులు ఒకరిపై మరొకరు దూషించుకుంటున్నారు. దీంతో.. సభ రసవత్తరంగా సాగుతోంది. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారాంపై నోరు జారడం.. ఆయన్ను సస్పెండ్ చేయాలని వైసీపీ నేతలు పట్టుబట్టడం.. ఆ తర్వాత తనపై మార్షల్స్ దాడి చేశారని చంద్రబాబు స్పీకర్‌కు ఫిర్యాదు చేయడం.. ఎవరు ఎవరిపై దాడి చేశారో చూపిస్తూ స్పీకర్ వీడియో రిలీజ్ చేయడం.. దానిపై సీఎం జగన్ చంద్రబాబును తీవ్రంగా విమర్శించడం.. బుద్ధి లేదు అనడం.. చంద్రబాబును రోజా పనికిమాలిన నేత, చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి అనడం.. ఇలా ఒకరిపై ఒకరు తిట్టుకోవడంతోనే సరిపోతోంది. చంద్రబాబు వ్యవహార శైలి బాగోలేదంటూ వైసీపీ నేతలు.. కాదు కాదు వైసీపీ నేతల శైలి బాగోలేదని అని టీడీపీ సభ్యులు ఆరోపించడం.. ఇలా ప్రజలకు ఏ మాత్రం అవసరం లేని వాదనలు, ప్రతివాదనలతోనే సభ నడుస్తోందని ప్రజలు అసెంబ్లీ సమావేశాలు జరిగే తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలోనూ అధికార, ప్రతిపక్షాల తీరును తప్పుపడుతున్నారు. ప్రజా సమస్యలపై గళమెత్తాల్సిన చోట వ్యక్తిగత దూషణలు, భౌతిక దాడులు ఏంటని నిలదీస్తున్నారు.

ఓ అంచనా ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో ఒక నిమిషానికి రూ.10,445 ఖర్చు అవుతుంది. అంటే.. గంటకు రూ.6లక్షలు.. అలా రోజుకు 6 గంటల పాటు సమావేశాలు కొనసాగుతాయని అనుకున్నా.. 36 లక్షల రూపాయలు ఖర్చవుతాయి. అలా సభ ఎన్ని రోజుల జరిగితే అంత ఎక్కువ ధనం నీళ్లపాలు కావాల్సిందే. సభలో ప్రజా సమస్యలపై చర్చించకుండా ఒకరినొకరు దూషించుకోవడానికే సరిపోతే.. భారీ స్థాయిలో ప్రజా ధనం వృథా అవుతున్నట్లే లెక్క. ఇప్పటికే నాలుగు రోజులు సమావేశాలు జరిగాయి. శుక్రవారం నాటికి ఐదో రోజు. ఈ రోజు కూడా మార్షల్స్‌‌తో వాగ్వాదంపైనే వాదనలు జరిగిలా ఉన్నాయి. ఇలా రోజులకు రోజులు రాష్ట్ర సమస్యలపై చర్చ జరపకపోతే సమావేశాలు ఎందుకని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
Published by: Shravan Kumar Bommakanti
First published: December 13, 2019, 11:07 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading