HOME » NEWS » politics » CROREPATI RAJYA SABHA MPS OUT OF THE 229 SITTING RAJYA SABHA MPS ANALYSED 89 PERCENT ARE CROREPATIS

Crorepati Rajya Sabha MPs: రాజ్యసభ ఎంపీల్లో 89శాతం మంది కోటీశ్వరులే...

Crorepati Rajya Sabha MPs: రాజ్యసభ సభ్యుల్లో 89 శాతం మంది సభ్యులు కోటీశ్వరులే కావడం విశేషం. ప్రస్తుతం రాజ్యసభలోని మొత్తం 230 మంది ఎంపీల్లో 229 మంది సమర్పించిన   అఫిడవిట్లను విశ్లేషించి ఈ వివరాలను ఓ సంస్థ వెల్లడించింది.

news18-telugu
Updated: July 22, 2020, 11:32 PM IST
Crorepati Rajya Sabha MPs: రాజ్యసభ ఎంపీల్లో 89శాతం మంది కోటీశ్వరులే...
రాజ్యసభ (ఫైల్ ఫోటో)
  • Share this:
రాజ్యసభ సభ్యుల్లో 89 శాతం మంది సభ్యులు కోటీశ్వరులే కావడం విశేషం. ప్రస్తుతం రాజ్యసభలోని మొత్తం 230 మంది ఎంపీల్లో 229 మంది సమర్పించిన   అఫిడవిట్లను విశ్లేషించి ఈ వివరాలను ఓ సంస్థ వెల్లడించింది. అఫిడవిట్లు సమర్పించిన 229 మంది ఎంపీల్లో 203 మంది ఎంపీలు(89శాతం) కోటీశ్వరులు. అంటే తమకు రూ.1 కోటికి పైగా ఆస్తులు ఉన్నట్లు స్వయంగా వారు తమ అఫిడవిట్లలో వెల్లడించారు. రాజ్యసభ సభ్యుల సరాసరి ఆస్తుల విలువ రూ.62.67 కోట్లుగా ఉంది. కాగా ఆయా పార్టీల రాజ్యసభ సభ్యుల ఆస్తుల విలువను విశ్లేషిస్తే...బీజేపీ కంటే కాంగ్రెస్ ఎంపీల సరాసరి ఆస్తుల విలువ ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించింది. రాజ్యసభలోని 77 మంది బీజేపీ సభ్యుల సరాసరి ఆస్తుల విలువ రూ.27.74 కోట్లుగా ఉండగా...కాంగ్రెస్ పార్టీకి చెందిన 40 మంది ఎంపీల సరాసరి ఆస్తుల విలువ రూ.38.96 కోట్లుగా ఉంది. అన్నాడీఎంకేకి చెందిన 9 మంది రాజ్యసభ సభ్యుల సరాసరి ఆస్తుల విలువ రూ.12.40 కోట్లుగా ఉంది.

జేడీయుకి చెందిన మహేంద్ర ప్రసాద్ రూ.4078 కోట్ల ఆస్తులతో రాజ్యసభ సభ్యుల్లో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వైసీపీకి చెందిన ఆళ్ల అయోధ్యరామి రెడ్డి రూ.2577 కోట్ల ఆస్తులతో రెండో స్థానంలో ఉండగా...సమాజ్‌వాది పార్టీకి చెందిన జయా బచ్చన్ రూ.1001 కోట్ల ఆస్తులతో మూడో స్థానంలో ఉన్నారు. రాజ్యసభ సభ్యులు సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా నేషనల్ ఎలక్షన్ వాచ్, ఏడీఆర్ ఈ వివరాలను వెళ్లడించింది. రాజకీయ పార్టీలు సంపన్నులను పెద్దల సభకు పంపుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ గణాంకాలు ఆసక్తికరంగా మారాయి.
రాజ్యసభ సభ్యుల్లో 54 మంది ఎంపీలు (24శాతం) తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు తమ అఫిడవిట్లలో వెల్లడించారు. కాగా 28 మంది ఎంపీలు(12 శాతం) తమపై నేరతీవ్రత ఎక్కువైన క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్‌లో వెల్లడించారు. 229 మంది ఎంపీల్లో కేవలం 22 మంది (10 శాతం) మాత్రమే మహిళలు మాత్రమే ఉన్నారు.
Published by: Janardhan V
First published: July 22, 2020, 11:30 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading