హోమ్ /వార్తలు /politics /

Chandrababu Naidu: కేసీఆర్ నుంచి వంశీ వరకు... చంద్రబాబు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మానరా..?

Chandrababu Naidu: కేసీఆర్ నుంచి వంశీ వరకు... చంద్రబాబు ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వడం మానరా..?

కేసీఆర్, చంద్రబాబు, వంశీ (ఫైల్)

కేసీఆర్, చంద్రబాబు, వంశీ (ఫైల్)

AP Politics: రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఈ రోజు ఓ పార్టీలో ఉన్నవారు రేపు మరోపార్టీలో ఉండొచ్చు. ఇవాళ జై కొట్టిన వారు రేపు తిట్టిపోయొచ్చు. ఈ రోజు తిట్టినవారు రైపు పొగడ్తల్లో ముంచెత్తవచ్చు.

రాజకీయాల్లో ఎప్పుడూ శాశ్వత మిత్రులు.. శాశ్వత శత్రువులు ఉండరు. ఈ రోజు ఓ పార్టీలో ఉన్నవారు రేపు మరోపార్టీలో ఉండొచ్చు. ఇవాళ జై కొట్టిన వారు రేపు తిట్టిపోయొచ్చు. ఈ రోజు తిట్టినవారు రైపు పొగడ్తల్లో ముంచెత్తవచ్చు. పాలిటిక్స్ లో ఇలాంటివి చాలా కామన్. అందునా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో (AP Politics) అయితే పార్టీలు మారడం, నిన్నటి వరకు ఆరాధించిన నాయకుడ్ని నేడు విమర్శించడం పెద్దకొత్తేం కాదు. కానీ పారీ వేరే పార్టీలో చేరి సక్సెస్ అయిన వారి క్రెడిట్ ను కూడా తమ ఖాతాలో వేసుకొవడం చాలా కొద్దిమందికే చెల్లు. లీడర్లు ఏ పార్టీలో ఉన్నా.. ఏలాంటి పదవులో ఉన్నా వారికి నేనే లైఫ్ ఇచ్చా అని చెప్పుకొడవం ఒకటి రెండుసార్లు చెల్లుబాటు అవుతుంది. కానీ పదేపదే అలా చెప్పుకోవడం, క్రెడిట్ ను కోట్ చేసుకోవడం లాంటివి చేస్తే విమర్శలపాలవక తప్పదు. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) అధినేత చంద్రబాబునాయుడు (Nara Chandra Babu Naidu) ఇలాంటి విమర్శలనే ఎదుర్కొంటున్నారు.

ముఖ్యమైన నేతలు టీడీపీని వీడినప్పుడల్లా నాయకులు పోయినా కేడర్ మనతోనే ఉందని అని చెప్పడం.. అలాగే టీడీపీ నాయకులను తయారుచేసే కర్మాగరం అని స్టేట్ మెంట్ ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు. అంతేకాదు పార్టీ మారిన నేతలపై విమర్శలు చేసిన సందర్భంలో వారికి లైఫ్ ఇచ్చింది నేనే అని కోట్ చేసుకోవడం కూడా చాలాసార్లు చూశాం. ఈ లిస్టులో తెలంగాణ సీఎం కేసీఆర్ నుంచి ఏపీ మంత్రి కొడాలి నాని, గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశ వరకు తానే లైఫ్ ఇచ్చానని కోట్ చేసుకోవడంపై విమర్శలే వస్తున్నాయి. ఈ లిస్టులో ఇంకా చాలామంది నేతలున్నారు.

ఇది చదవండి : జూనియర్ ఎన్టీఆర్ కు లక్ష్మీపార్వతి కౌంటర్.. బాలకృష్ణ.. చంద్రబాబు ట్రాప్ లో పడ్డారని కామెంట్..
నిన్నటికి నిన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ ని కూడా మీకు రాజకీయ భిక్ష పెట్టింది నేనే... ఇప్పుడు పార్టీ మారిన నన్నే నిర్లక్ష్యం చేస్తారా అనే విధంగా చంద్రబాబు ప్రశ్నించడం కూడా విమర్శలకు తావిస్తోంది. చంద్రబాబు వ్యాఖ్యలకు తమ్మినేని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాజకీయంగా తనకు వైఎస్ జగన్ పునర్జన్మనిచ్చారంటూ సమాధానం ఇచ్చారు.

ఇది చదవండి: ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న సీఎం జగన్..? ముహూర్తం ఆ రోజేనా..?ఐతే కేసీఆర్ కు తానే రాజకీయ భిక్ష పెట్టానని చంద్రబాబు గతంలో చెప్పుకున్నా.. తెలంగాణ సాధించి సీఎం అయిన తర్వాత కూడా ఒకటి రెండుసార్లు ఇదే రకంగా చెప్పుకున్నారు.  అలాగే కొడాలి నాని విషయంలోనూ అదే జరిగింది. టీడీపీలో ఎమ్మెల్యేగా ఉండగానే ఆయన రాజీనామా చేసి వైసీపీలో చేరారు. పార్టీ మారినా ఆయన తన సొంత ఛరిష్మాతో గుడివాడలో విజయం సాధించి మంత్రయ్యారు. ఇక టీడీపీ తరపునే ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ ఆ తర్వాత జగన్ కు జై కొట్టారు. వంశీకి కూడా రాజకీయ భిక్ష తానే పెట్టానని చంద్రబాబు చాలాసార్లు అన్నారు. ఐతే వైసీపీ హవాలోనూ గెలవడం వెనుక చంద్రబాబు కృషి లేదని.. సొంతగా విజయం సాధించానని వంశీ చెబుతుంటారు. నిజానికి టీడీపీలో ఉన్నప్పుడు కూడా వంశీకి చంద్రబాబు నుంచి పెద్దగా సహకారం లేదు.

ఇది చదవండి: సలహాదారులపై జగన్ కి నమ్మకం సడలిందా..? వాళ్లని సాగనంపడం ఖాయమేనా..?ఐతే నేతలు పార్టీని వదిలేసి ఏళ్లు గడిచినా గతంలో  తానే లైఫ్ ఇచ్చానని క్లైమ్ చేసుకోవడం కంటే పార్టీలో ఉన్నవారిని కాపాడుకోవడం మీద దృష్టిపెట్టాలని సదరు నేతలు హితవుపలుకుతున్నారు. పార్టీని వదిలేసి వెళ్లిన వారి సక్సెస్ ను కూడా ఖాతాలో వేసుకుంటే ఇక్కడే ఉన్నవారికి ఎలాంటి మేసేజ్ ఇస్తున్నారని ప్రశ్నించేవారూ లేకపోలేదు. ఇప్పటికే పార్టీలో యువకులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న విమర్శ ఎలాగూ ఉంది. వెళ్లిపోయిన వారి క్రెడిట్ కోసం పాకులాడేకంటే యువకులను ప్రోత్సహించి అవకాశాలివ్వొచ్చుగా అని మరికొందరు సూచిస్తున్నారు. మరి ఈ విషయంలో బాబుగారి ఆలోచన మారుతుందా..? లేక వెళ్లిన పోయినవారినే పదేపదే తలుచుకుంటూ టైమ్ వేస్ట్ చేస్తారా..? అనేది వేచి చూడాలి.

First published:

Tags: Andhra Pradesh, AP Politics, Chandrababu Naidu, Kodali Nani, TDP, Vallabaneni Vamsi

ఉత్తమ కథలు