కోడెల, ఆయన కుమారుడిపై క్రిమినెల్ కేసు నమోదు

కోడెలపై కేసు నమోదు

అసెంబ్లీ లోని ఫర్నిచర్ ను తన కొడుకు హోండా షో రూమ్ లోకి తరలించారని ఈశ్వార్రావు తన ఫిర్యాదులో పేర్కొర్నారు.

  • Share this:
    మాజీ స్పీకర్ కోడెలపై కేసు నమోదైంది. తుళ్లూరు పోలీస్ స్టేషన్  పరిధిలోని కోడెలతో పాటు అతని కుమారుడిపై పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఐపీసీ సెక్షన్  409,411 ల కింద కేసు నమోదు చేశారు. అసెంబ్లీ కార్యదర్శి పేరుతో పోలీస్ స్టేషన్ లో సెక్షన్ ఆఫీసర్ ఈశ్వరరావు...ఫిర్యాదు చేశారు. ఈశ్వర రావు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా నిన్న రాత్రి కోడెలపై అధికారులు కేసు నమోదు చేశారు.  అసెంబ్లీ లోని ఫర్నిచర్ ను తన కొడుకు హోండా షో రూమ్ లోకి తరలించారని ఈశ్వార్రావు తన ఫిర్యాదులో పేర్కొర్నారు. ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా తన సొంత కార్యాలయాలకు తరలించారని ఆరోపించారు. కోడెల తనయుడికి చెందిన గౌతమ్ హోండా షోరూం లో ఫర్నిచర్ ఉన్నట్లు ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దీంతో మాజీ స్పీకర్ కోడెల,అతని కొడుకు శివరాం ప్రసాద్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.
    Published by:Sulthana Begum Shaik
    First published: