చంద్రబాబుకు షాక్... అమరావతి మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు

అమరావతి డిజైన్లు

సచివాలయం పాత ప్లాన్ లోని ఐదు టవర్లకు బదులు రెండు టవర్లు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు.

 • Share this:
  ఏపీ రాజధాని నిర్మాణానికి కొత్త మాస్టర్ ప్లాన్ రూపొందించే పనిలో పడింది ప్రభుత్వం. ఇప్పటికే సింగపూర్ ఇచ్చిన మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేయాలనుకుంటుంది.
  అమరావతి పనులను ముందుకు తీసుకెళ్ళడానికి కొత్త ప్రణాళికలు తయారు చేసే పనిలో పడ్డారు సీఆర్డీయే అధికారులు. 25 అంతస్తుల నిర్మాణాలకు బదులు 10 అంతస్తుల నిర్మాణాలు చేపట్టాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి అందుబాటులో ఉన్న నిధులను దృష్టిలో ఉంచుకుని సీఆర్డీఏ ప్రతిపాదనలను సిద్ధం చేసింది. సచివాలయం పాత ప్లాన్ లోని ఐదు టవర్లకు బదులు రెండు టవర్లు నిర్మాణం చేపట్టాలనుకుంటున్నారు. 2022-23 నాటికి మొదటి దశలో 3,4వ టవర్ల పూర్తికి 3 వేల 132 కోట్ల వ్యయం అంచనా వేశారు. ఇప్పటికే వీటి కోసం రూ. 332కోట్లు ఖర్చు చేశారు. మరో రూ. 2వేల800కోట్లు అవసరం అవుతోంది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ. 321కోట్లు విడుదల అయ్యే అవకాశాలున్నాయి.

  అయితే గత ప్రభుత్వం హయాంలో... ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు.. సింగపూర్ అధికారులతో కలిసి అమరావతి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. సింగ్‌పూర్ అధికారులతో కలిసి రాజధాని నిర్మాణం కోసం ప్రత్యేకంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారు. అయితే ఇప్పుడా ఆ మాస్టర్ ప్లాన్‌లో భారీ మార్పులు చేపట్టింది జన్ సర్కార్.

  ఇవికూడా చూడండి:
  తమిళనాడు బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
  First published: