Breaking: టీఆర్ఎస్‌కు బిగ్ షాక్...సీపీఐ సంచలన నిర్ణయం

సీపీఐ తెలంగాణ కార్యవర్గం భేటీలో మద్దతు ఉపసంహరణకే మొగ్గుచూపింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలపై ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది.

news18-telugu
Updated: October 14, 2019, 7:53 PM IST
Breaking: టీఆర్ఎస్‌కు బిగ్ షాక్...సీపీఐ సంచలన నిర్ణయం
సీఎం కేసీఆర్
  • Share this:
హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్‌కు మద్దతు ప్రకటించిన సీపీఐ... ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతున్న నేపథ్యంలో సపోర్ట్‌పై వెనక్కి తీసుకుంది. సీపీఐ తెలంగాణ కార్యవర్గం భేటీలో మద్దతు ఉపసంహరణకే మొగ్గుచూపింది. ఆర్టీసీ కార్మికులతో చర్చలపై ఇచ్చిన డెడ్‌లైన్ ముగియడంతో సీపీఐ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ సమ్మె, సమ్మెపై ప్రభుత్వ వైఖరి గురించి చర్చించేందుకు సీపీఐ రాష్ట్ర కార్యవర్గం హైదరాబాద్‌లో సమావేశమైంది. సీపీఐ ముఖ్యనేతలు చాడ వెంకట్ రెడ్డి, పల్లా వెంకట్ రెడ్డితో పాటు ఆ పార్టీ జాతీయ నేత సురవరం సుధాకర్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు.

ఆర్టీసీ ఉద్యోగులతో ఈ నెల 13లోపు చర్చలు జరపాలని సీపీఐ గతంలోనే ప్రభుత్వానికి సూచించింది. ఈ గడువు ముగియడం... ఆర్టీసీ ఉద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో... హుజూర్ నగర్‌లో టీఆర్ఎస్‌కు మద్దతిచ్చే అంశంపై సీపీఐ పునరాలోచనలో పడింది. ఇంకా టీఆర్ఎస్‌కు మద్దతిస్తే కార్మికులు దృష్టిలో తాము విలన్‌గా మిగిలిపోతామని ఆ పార్టీ నేతలు భావించినట్లు తెలుస్తోంది.
Published by: Krishna Adithya
First published: October 14, 2019, 7:49 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading