CPI NARAYANA VISITS VISHAKA SARADA PEETHAM FOR CAMPAIGN NGS
Municipal electoins: శారదాపీఠంలో సీపీఐ నారాయణ.. స్వామిని కామ్రేడ్ ఏం అడిగారంటే
సీపీఐ నారాయణ ఏమి చేసినా సంచలనమే.. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఆయన శారదా పీఠంలో ప్రత్యక్ష్యమయ్యారు. అంతేకాదు స్వామీజీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. అక్కడ వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది.
సీపీఐ నారాయణ ఏమి చేసినా సంచలనమే.. అయితే ఈసారి ఎవరూ ఊహించని విధంగా ఆయన శారదా పీఠంలో ప్రత్యక్ష్యమయ్యారు. అంతేకాదు స్వామీజీ ఆశీర్వాదాలు కూడా తీసుకున్నారు. అక్కడ వారిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ కూడా జరిగింది.
కమ్మూనిస్టులందు నారాయణ వేరయా అనాలి ఏమో.. ఎందుకంటే ఆయన ఏం చేసినా సంచలనమే అవుతుంది. ఆయన మాటలు ఎంత సంచలనంగా ఉంటాయో.. ఆయన చేసే పనులుకూడా అంతే మీడియాలో హైలైట్ అవుతూ ఉంటాయి. ఆయన చేసే కొన్ని పనులు క్షణాల్లో వైరల్ గా మారిపోతాయి.. ఇప్పుడూ కూడా ఎవ్వరూ ఊహించని పని చేసి అందరూ అవాక్కయ్యేలా చేశారు.
తాజాగా విశాఖలోని శారదా పీఠంలో సీపీఐ నారాయణ ప్రత్యక్షమయ్యారు నారాయణ.. ఏదో ఉద్యమం చేయాడానికో.. ఆశ్రమాన్ని ముట్టడించడానికనో వెళ్తే ఎవరూ ఆశ్చర్యపోనక్కర్లేదు.. కానీ ఆయన అక్కడ స్వరూపానందేంద్ర స్వామి ఆశీర్వాదం కూడా తీసుకుని షాకిచ్చారన్నారు.
అదేంటి కరుడుగట్టిన కమ్యూనిస్టు నారాయణ.. శారదాపీఠం వెళ్లడమేంటి..? అక్కడ ఆశీర్వాదం తీసుకోవడం ఏంటి..? అనే అనుమానం అందరికీ వస్తుంది. కానీ ఇది నిజం. ఆయన తల వంచి మరి స్వామీజీకి నమస్కారం చేశారు. నారాయణకు సాలువా కప్పి ఆశీర్వాదమందించారు స్వరూపానందేంద్ర స్వామి.
ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ప్రస్తుతం ఏపీలో మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులోనూ జీవీఎంసీ ఎన్నికలైతే అన్ని పార్టీలకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. అక్కడి మేయర్ పీఠంపై అన్ని పార్టీలు ఫోకస్ చేశాయి. అయితే టీడీపీతో కలిసి వెళ్లేందుకు సిద్ధమైన సీపీఐ తాము పోటీ చేస్తన్న అన్ని స్థానాల్లో నెగ్గాలని కంకణం కట్టుకుంది. అందుకే జాతీయ నేతలు ప్రచారం బాట పట్టారు. ఇందులో భాగంగా ఆయన సీపీఐ అభ్యర్థి తరపున ప్రచారం చేశారు..
97వ వార్డు అభ్యర్తి యశోద తరపున చిన మూషిడివాడలో ప్రచారం చేసిన నారాయణ.. అక్కడే ఉన్న విశాఖ శారదా పీఠాన్ని కూడా సందర్శించారు. తమ అభ్యర్థికి ఓటు వేయాలని శారదాపీఠంలో ఉన్న వారిని అభ్యర్థించారు. పనిలో పనిగా స్వామివారి ఆశీర్వాదం కూడా తీసుకున్నారు.
అయితే శారదా పీఠంలో నారాయణ ప్రత్యక్షం కావడం పొలిటికల్ వర్గాల్లో తీవ్ర ఆసక్తి పెంచింది. సాధరణంగా కమ్యూనిస్టులు ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉంటారు. ఆలయాలు, స్వామీజల వైపు చూడరు.. కానీ నారాయణకు ఇలాంటి విషయాల్లో మినహాయింపు ఇవ్వాల్సిందే. ఎందుకంటే గాంధీ జయంతి రోజు చికెన్ తిని.. ఏడాది పాటు చికెన్ తినడం మానేశారు ఆయన,. ఆ తరువాత తిరుమల వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని అందరికీ షాక్ ఇచ్చారు. ఇలా ఎవరూ ఊహించని పనులు చేసి అందరికీ షాక్ ఇవ్వడం ఆయనకు ఆనవాయితీనే. అప్పుడు తిరుమలకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తే.. చాలాసార్లు తిరుమలకు వచ్చా.. కానీ, శ్రీవారిని దర్శించుకోలేదు.. కానీ, కుటుంబసభ్యులు బలవంతం చేయడంతో ఈసారి తప్పలేదని సమాధానం ఇచ్చారు.
ఇప్పుడు కూడా అలాంటి సమాధానమే చెబుతారు ఏమో. స్వామీజీ అయితే మాత్రం ఓటు వేయరా.. వారికి ఓటు హక్కు ఉండదా అంటారు ఏమో. ఏదీ ఏమైనా స్వామీజీ దగ్గర నారాయణ ఆశీర్వాదం తీసుకున్న అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.