సీపీఐ నారాయణ బహిరంగ క్షమాపణలు.. ఎన్‌కౌంటర్‌పై యూటర్న్

ఎన్‌కౌంటర్‌ను సమర్థించినందుకు పార్టీకి,ప్రజా సంఘాలకు,వామపక్ష వాదులకు బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యవర్గంలో చర్చ జరిగిందని.. పార్టీ సభ్యులు తప్పుపట్టడంతో క్షమాపణ చెబుతున్నానని తెలిపారు.

news18-telugu
Updated: December 8, 2019, 3:10 PM IST
సీపీఐ నారాయణ బహిరంగ క్షమాపణలు.. ఎన్‌కౌంటర్‌పై యూటర్న్
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ
  • Share this:
దిశా హత్యాచార నిందితులను ఎన్‌కౌంటర్ చేయడాన్ని సమర్థించిన సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ..తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. కమ్యూనిస్టు నేత అయి ఉండి బూటకపు ఎన్‌కౌంటర్‌ను సమర్థించడమేంటని పార్టీ నుంచి,ప్రజా సంఘాల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఆయన యూటర్న్ తీసుకోక తప్పలేదు. ఎన్‌కౌంటర్‌పై తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నట్టు చెప్పారు. ఎన్‌కౌంటర్‌ను సమర్థించినందుకు పార్టీకి,ప్రజా సంఘాలకు,వామపక్ష వాదులకు బహిరంగ క్షమాపణలు తెలియజేశారు. తన వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యవర్గంలో చర్చ జరిగిందని.. పార్టీ సభ్యులు తప్పుపట్టడంతో క్షమాపణ చెబుతున్నానని తెలిపారు. బూటకపు ఎన్‌కౌంటర్లకు సీపీఐ వ్యతిరేకమని చెప్పారు.పార్టీ సిద్దాంతాలకు వ్యతిరేకంగా తాను చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు.

కాగా,ఎన్‌కౌంటర్ జరిగిన రోజు దాన్ని సమర్థిస్తూ నారాయణ మాట్లాడారు. పార్టీ కూడా ఎన్‌కౌంటర్‌ను సమర్థిస్తుందన్నారు.సమాజంలో దిశా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే ఎన్‌కౌంటర్లు చేయడం సరైందేనన్నారు.

First published: December 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>