Home /News /politics /

COUNTING HOLDS AT MADANAPALLI RURAL MANDAL AS LOCALS CALL FOR PROTEST AGAINST COUNTING OFFICIALS WHO TRIED TO SHIT BALLOT BOXES FORM POLLING CENTER HERE ARE THE DETAILS PRN

AP Panchayat Elections: పంచాయతీ ఎన్నికల కౌంటింగ్ లో టెన్షన్ టెన్షన్..

పంచాయతీ ఎన్నికల పోలింగ్ (ఫైల్)

పంచాయతీ ఎన్నికల పోలింగ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పంచాయతీ ఎన్నికల (AP Panchayat Elections) రెండో విడత పోలింగ్ పూర్తైంది. 2,786 గ్రామాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సజావుగా పూర్తైనా.., కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి.

    ఆంధ్రప్రదేశ్ పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ పూర్తైంది. 2,786 గ్రామాల్లో కౌంటింగ్ కొనసాగుతోంది. పోలింగ్ సజావుగా పూర్తైనా.., కౌంటింగ్ సందర్భంగా ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా మదనపల్లె రూరల్ మండలం కోళ్లబైలులో టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్సులను గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న బైరెడ్డి కాలనికి తరలించేందుకు అధికారులు యత్నించడంతో స్థానికులు అడ్డుకున్నారు. పోలింగ్ కేంద్రం వద్ద సెల్ ఫోన్ సిగ్నల్స్, ఇంటర్నెస్ సరిగా రాకపోవడంతోనే వేరే చోటుకు తరలిస్తున్నామని కౌంటింగ్ అధికారులు చెప్పినా స్థానికులు వినలేదు. గ్రామస్తులంతా కౌటింగ్ కేంద్రం వద్ద బైఠాయించడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో కోళ్లబైలులో కౌంటింగ్ నిలిచిపోయింది. మదనపల్లె డీఎస్పీ గ్రామానికి చేరుకొని స్థానికులకు నచ్చజెప్పినా వారు వినలేదు.

    ఇక రెండో విడత పోలింగ్ లో ఓటర్లు భారీగా పాల్గొన్నారు. తొలివిడత మాదిరిగానే రెండో విడతలోనూ 80శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. ఈసారి రాష్ట్ర వ్యాప్తంగా 81.61శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మొదటి విడతలో 81.09 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి 0.52శాతం అధికంగా 81.61 శాతం మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ విడతలో ప్రకాశం జిల్లాలో అత్యధికంగా 86.60 శాతం ఓటింగ్ రికార్డవగా.. శ్రీకాకుళం జిల్లాలో అత్యల్పంగా 72.87 శాతం నమోదైంది.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Andhra pradesh news, Ap local body elections, AP News, Gram Panchayat Elections, Local body elections, Telugu news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు