Home /News /politics /

COUNSELORS OF DUBBAKA MUNICIPALITY REJOINED IN TRS FROM BJP WHO JOINED YESTERDAY ITSELF VRY

Dubbaka : ఇజ్జత్‌కా సవాల్...స్వంత గూటికి కౌన్సిలర్స్‌ను రప్పించిన టీఆర్ఎస్...!

Dubbaka : గేమ్స్ ఆడుతున్న దుబ్బాక కౌన్సిలర్స్... ఒక్కరోజులోనే రెండు పార్టీల మార్పు..

Dubbaka : గేమ్స్ ఆడుతున్న దుబ్బాక కౌన్సిలర్స్... ఒక్కరోజులోనే రెండు పార్టీల మార్పు..

Dubbaka : దుబ్బాక మున్సిపల్ కౌన్సిలర్స్..రాజకీయాలను ఓ గేమ్‌లా మార్చారు..కనీస విలువలు లేకుండా ఒక్క రోజులోనే రెండు ప్రధాన పార్టీలను మార్చారు. ..ఏ పార్టీలో కొనసాగాలో తెలియకుండా అటు నుండి ఇటు..ఇటు నుండి అటు.. ఊగిసలాడారు.

    గత కొద్దిరోజులుగా టీఆర్ఎస్‌లో కొనసాగిన దుబ్బాక కౌన్సిలర్లు ముగ్గురు తిరిగి తమ స్వంత గూటికి చేరుకున్నారు. ఒక్క రోజులోనే ఏ పరిణామాలు జరిగాయో ఏమో గాని.. నిన్న బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తోపాటు స్వయంగా దుబ్బాక ఎమ్మెల్యే సమక్షమంలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ 24 గంటలు కూడా గడవక ముందే..తిరిగి స్వంత గూటికి చేరుకున్నారు. వారికి మంత్రి హరీష్ రావు కండువా కప్పి పార్టీలోకి తిరిగి ఆహ్వానించారు.

    రాష్ట్రవ్యాప్తంగా ఆపరేషన్‌ ఆకర్ష్‌‌లతోపాటు వికర్ష్‌లు ఊపందుకున్నాయి..దీంతో అధికార పార్టీ నుండి బీజేపీలోకి , బీజేపి నుండి కాంగ్రేస్‌లోకి నేతలు మారుతున్నారు..ముఖ్యంగా హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలోనే ఇవి మరింత ఊపందుకున్నాయి. కాగా వీటిని అధికార పార్టీ ఎక్కువగా ప్రొత్సహిస్తుంది.. ఈ క్రమంలోనే టీడీపీ అధ్యక్షుడు ఎల్‌ రమణతోపాటు పలువురు నేతలు పార్టీలో చేరారు.మరోవైపు కాంగ్రేస్ సైతం తక్కువ కాదన్నుట్టుగా బీజేపీలో కొనసాగుతున్న భూపాలపల్లి నేత గండ్రసత్యనారయణ రావుతోపాటు మహబుబ్‌నగర్ జిల్లా ఇంచార్జ్‌ను ఆకర్ష్‌లో భాగంగా చేర్చుకుంది.

    ఈ నేపథ్యంలోనే రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ ట్రెండ్ నడుస్తుంటే..దుబ్బాకలో మాత్రం ఆ పార్టీకి మంగళవారం చుక్కెదురైంది. అధికార పార్టీని కాదని స్థానిక కౌన్సిలర్‌లు బీజేపీలో చేరారు. దీంతో అధికార పార్టీ ఆపరేషన్ ఆకర్ష్ కాస్తా...వికర్ష్ ‌గా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు, బీజేపీ నాయకులు విజయశాంతి, డీకే అరుణ సమక్షంలో కమలం తీర్థం పుచ్చుకున్నారు.

    వివరాల్లోకి వెళితే..గత ఎన్నికల్లో దుబ్బాక మున్సిపాటీలోని స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచిన ముగ్గురు కౌన్సిలర్లు మట్ట మల్లారెడ్డి(3వ వార్డు), కనకయ్య(7వ వార్డు), దుబ్బాక బాలకిషన్‌(8వ వార్డు) ఎన్నికల అనంతరం అప్పటి ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ప్రోద్బలంతో టీఆర్‌ఎస్‌లో చేరారు. అయితే ఇటివల వారికి తగిన ప్రాధాన్యత లభించలేదని కౌన్సిలర్‌ మట్ట మల్లారెడ్డి ప్రకటించారు, గత ఉప ఎన్నికల ఫలితాల తర్వాత నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీ వారికి ప్రాధాన్యం ఇవ్వడం లేదని కౌన్సిలర్‌లు వాపోయారు.. బీజేపీలో చేరుతున్నట్టు ప్రకటించారు. దీంతో టీఆర్‌ఎస్‌ పార్టీ ఈ ముగ్గురిని పార్టీ నుంచి సస్పెండ్‌ చేసింది.

    అయితే కౌన్సిలర్లు బీజేపీలో చేరడాన్ని టీఆర్ఎస్ సీరియస్‌గా తీసుకుంది. వెంటనే వారిని పార్టీలోకి తీసుకువచ్చేందుకు స్థానిక నేతలతో పాటు ఎంపీ కొత్తకోట ప్రభాకర్ రెడ్డిని రంగంలోకి దింపారు. ఎలాగైనా వారిని తిరిగి పార్టీలోకి తీసుకువచ్చేలా స్కెచ్ వేశారు..ఇంకేముంది అధికార పార్టీ నేతల చర్చలతో ఒక్కరోజులోనే కౌన్సిలర్లు తమ అభిప్రాయాన్ని మార్చుకున్నారు. దీంతో కాషాయ కండువా తీసి..తిరిగి గులాబి జెండాను భూజాన వేసుకున్నారు. నేడు మంత్రి హరీష్ రావు ముగ్గురు కార్పోరేటర్లకు కండువాలు కప్పి తిరిగి పార్టీలోకి ఆహ్వానించారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Bjp, Dubbaka, Trs

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు