అప్పుడే అయిపోలేదు.. అజిత్ పవార్‌కు అమిత్ షా బిగ్ షాక్..

కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కి షాక్ ఇచ్చారు. బీజేపీతో చేతులు కలిపాక ఆయనపై ఉన్న రూ.70వేల కోట్ల స్కామ్‌కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వచ్చిన కథనాలపై ఆయన పరోక్షంగా స్పందించారు.

news18-telugu
Updated: November 27, 2019, 3:06 PM IST
అప్పుడే అయిపోలేదు.. అజిత్ పవార్‌కు అమిత్ షా బిగ్ షాక్..
అజిత్ పవార్,అమిత్ షా
  • Share this:
మహారాష్ట్ర రాజకీయం అనేక మలుపులు తిరిగి చివరకు శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో శరద్ పవార్ చాణక్యం ముందు అమిత్ షా,మోదీ తేలిపోయారన్న చర్చ జరుగుతోంది. అయితే ఇంతలోనే కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కి షాక్ ఇచ్చారు. బీజేపీతో చేతులు కలిపాక ఆయనపై ఉన్న రూ.70వేల కోట్ల స్కామ్‌కు ఏసీబీ క్లీన్ చిట్ ఇచ్చినట్టుగా వచ్చిన కథనాలపై ఆయన పరోక్షంగా స్పందించారు. అవినీతి కేసులపై అజిత్ పవార్‌కు క్లీన్ చిట్ రాలేదన్నారు. అజిత్‌పై ఉన్న కేసుల్లో ఏ ఒక్కటి ఎత్తివేయలేదన్నారు.అంతేకాదు,తాము అజిత్ పవార్ మద్దతు కోరలేదని.. ఎన్సీపీ శాసనసభా పక్ష నేత హోదాలో ఆయనే తమకు మద్దతు తెలిపారని అమిత్ షా అన్నారు.ఏదేమైనా అమిత్ షా వ్యాఖ్యలను బట్టి చూస్తే.. భవిష్యత్‌లో అవినీతి కేసులు ఆయన్ను వెంటాడే అవకాశం కనిపిస్తోంది.

కాగా,శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. బీజేపీ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన.. ఆ తర్వాత శరద్ పవార్ కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకుపదవికి రాజీనామా చేసి తిరిగి సొంత గూటికి చేరిన సంగతి తెలిసిందే. అజిత్ పవార్ నిర్ణయంతో ఫడ్నవీస్ ముఖ్యమంత్రి పదవికి రెండు రోజులే పరిమితమయ్యారు. నవంబర్ 28న ఉద్దవ్ థాక్రే సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.
Published by: Srinivas Mittapalli
First published: November 27, 2019, 2:31 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading