Home /News /politics /

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై లంచం ఆరోపణలు...

వైసీపీ మహిళా ఎమ్మెల్యేపై లంచం ఆరోపణలు...

వుండవల్లి శ్రీదేవి

వుండవల్లి శ్రీదేవి

వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

    వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, తాడికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. సిమెంట్ రోడ్డు బిల్లుల విషయంలో ఎమ్మెల్యే శ్రీదేవి రూ.3 లక్షలు లంచం తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఫిరంగిపురం మండలం బేతపూడి సొసైటీ అధ్యక్షుడు జాకీర్ ఈ మేరకు ఎమ్మెల్యే మీద ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్యే తీరుకు నిరసనగా తన సొసైటీ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు జాకీర్ తెలిపాడు. ఎమ్మెల్యే శ్రీదేవి విషయం త్వరలోనే సీఎం జగన్ దృష్టికి తీసుకెళతామని బేతపూడి గ్రామ ముస్లిం మైనారిటీలు తెలిపారు.

    ఇటీవల తాడికొండ వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిపై కొందరు అనుచిత వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు వైసీపీ కార్యకర్తలు ఫిర్యాదు చేశారు. తాడికొండ వైసీపీ నాయకులు ఈ మేరకు తుళ్లూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఏపీలో ఓ వైపు జగన్ ప్రభుత్వం.. ఆడవారిపై వేధింపులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తుంటే.. మరోవైపు జగన్ పార్టీ మహిళా ఎమ్మెల్యేలపైనే.. కొందరు అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారు. కొన్ని రోజుల క్రితం వైసీపీ మరో ఎమ్మెల్యే విడదల రజినిపై ఇద్దరు యువకులు అభ్యంతరకర పోస్టులు పెట్టారు. దీంతో ఆ ఇద్దర్నీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేను కించపరిచే విధంగా నెల్లూరు జిల్లాకు చెందిన యువకులు సత్యంరెడ్డి, ప్రవీణ్ లు సోషల్ మీడియాలో పోస్టింగ్స్ చేశారు. ఈ విషయమై ఆరా తీసిన చిలకలూరిపేట పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    Tags: Andhra Pradesh, Vundavalli sridevi, Ysrcp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు