ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చారా? ఏది నిజం?

ఈ అంశంపై న్యూస్‌తో 18 మాట్లాడుతూ.. తనపై ఎవరో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు అంజాద్ బాషా. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

news18-telugu
Updated: March 31, 2020, 10:56 PM IST
ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లొచ్చారా? ఏది నిజం?
అంజద్ బాషా
  • Share this:
ఢిల్లీ నిజాముద్దీన్ పేరు చెబితే యావత్ భారత దేశం వణికిపోతోంది. ఇక్కడ మర్కజ్ మత ప్రార్థనలకు హాజరైన వారిలో చాలా మందికి కరోనా వైరస్ సోకింది. అక్కడికి వెళ్లొచ్చిన వారిలో చాలా మంది తెలుగు వారు ఉన్నారు. వారిలోనూ పలువురికి ఇప్పటికే కరోనా పాజిటివ్ వచ్చింది. తెలంగాణలో ఏకంగా ఆరుగురు చనిపోయారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ మత ప్రార్థనలకు వెళ్లొచ్చినవారిపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించి.. తగు చర్యలు చేపట్టాయి. ఐతే ఏపీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా సైతం ఢిల్లీలో జరిగిన మత ప్రార్థనలకు హాజరయ్యారని ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆ తర్వాత ఏపీకి తిరిగొచ్చి NPR అంశంపై ముస్లిం మత పెద్దలతో కలిసి సీఎం జగన్‌తో సమావేశమయ్యారని సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది.

ఐతే ఈ వార్తలను డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తీవ్రంగా ఖండించారు. ఈ అంశంపై న్యూస్‌తో 18 మాట్లాడుతూ.. తనపై ఎవరో ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దీనిపై చట్టపరంగా క్రిమినల్ కేసులు పెట్టడంతో పాటు పరువు నష్టం దావా వేస్తానని స్పష్టం చేశారు అంజాద్ బాషా.

నాపై, ఈ ప్రభుత్వంపై పచ్చ మీడియా పెద్ద కుట్రకు తెరలేపింది. ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో బాధ్యతాయుతంగా ఉండాల్సిన కొన్ని మీడియా సంస్థలు రాజకీయాలకు తెరలేపుతున్నాయి. నేను ఈ నెల 2వ తేదీన ముస్లింలకు వైఎస్సార్ ఇచ్చిన 4 శాతం రిజర్వేషన్ కేసు విషయమై ఢిల్లీ వెళ్ళాను. కానీ నేను అక్కడి మత ప్రార్థనలకు వెళ్లినట్లు దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఒక రాష్ట్రానికి డెప్యూటీ సీఎంను..నాకు ప్రోటోకాల్ ఉంటుంది. అందులో నా ప్రతి ఒక్క అడుగు నమోదు అవుతుంది. ఆ రోజు నేను ఏపీ భవన్ లొనే బస చేసాను. మరుసటి రోజు సీఎం గారిని కలిశాను. 4వ తేదీ కాబినెట్‌లోనూ ఉన్నాను. ఆ తర్వాత కడప చేరుకుని ఎన్నికల పనుల్లో పడ్డాం. ఇదంతా ఈ కరోనా సమయంలో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని, నన్ను ఇబ్బంది పెట్టాలని పచ్చ మీడియా పన్నిన కుట్ర. అందుకే నేను చట్టపరంగా క్రిమినల్ కేసు పెడతాను. పరువు నష్టం దావా వేస్తాను.
అంజాద్ బాషా


ప్రజలంతా వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా. కాగా, ఏపిలో ఇప్పటి వరకు 44 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇవాళ ఒక్కరోజే 21 కేసులు వెలుగులోకి వచ్చాయి. బాధితుల్లో ఎక్కువ మంది ఢిల్లీలోని మర్కజ్ మత ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారే ఉన్నారు. ఏపీలో ఇద్దరు పేషెంట్లు డిశ్చార్జి కావడంతో..ప్రస్తుతం 42 యాక్టివ్ కరోనా కేసులున్నాయి. విశాఖపట్టణంలో ఒకరు, నెల్లూరులో ఒకరు వ్యాధి నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
First published: March 31, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading