• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CORONA UPDATES WAR OF WORDS BETWEEN CENTRE AND MAHARASHTRA GOVT OVER OXYGEN CORONA VACCINE AND REMDISIVIR SK

కరోనా కష్టాల వేళ.. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం.. ఎందుకీ ఫైట్?

కరోనా కష్టాల వేళ.. మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం మధ్య మాటల యుద్ధం.. ఎందుకీ ఫైట్?

ఉద్ధవ్ థాక్రే (File )

మహారాష్ట్రలో శనివారం 67,123 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 56,783 మంది డిశ్చార్జి అవగా.. మరో 419 మంది మరణించారు.

  • Last Updated:
  • Share this:
    కరోనా వైరస్ భారత్‌ను కకావికలం చేస్తోంది. సెకండ్ వేవ్ అల్లకల్లోలం రేపుతోంది. ప్రతి రోజు రెండు లక్షలకు పైగా కొత్త కేసులు వస్తున్నాయి. వెయ్యి మందికి పైగా మరణిస్తున్నారు. కరోనా మహోగ్రరూపం దాల్చడంతో కేంద్రం సీరియస్‌గా దృష్టి సారించింది. రాష్ట్రాలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ కరోనా వైరస్‌పై సమీక్షిస్తున్నారు. ప్రధాని మోదీ రెండు రోజుల్లో రెండు ఉన్నత స్థాయి సమావేశాలు నిర్వహించారు. ఇలాంటి సమయంలో మహారాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మహారాష్ట్రపై కేంద్రం కక్షపూరితంగా వ్యహరిస్తోందని.. కరోనా కట్టడి విషయంలో ఏమాత్రం సహకరించడం లేదని శివసేన, ఎన్సీపీ నేతలు మండిపడుతున్నారు.

    మహారాష్ట్రలకు అవసరమైన కరోనా వ్యాక్సిన్‌లు, ఆక్సీజన్, రెమిడిసివిర్ ఇంజెక్షన్‌లను సరఫరా చేయడం లేదని కేంద్రంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మహారాష్ట్ర కంటే తక్కువ కేసులు నమోదువుతున్న గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్‌కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలే భారతీయులా.. ఇతర రాష్ట్రాల ప్రజలు ఈ దేశంలో లేరా? అని తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ థాక్రే నేరుగా ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఆక్సీజన్ కొరత గురించి ప్రధాని మోదీతో మాట్లాడేందుకు ప్రయత్నిస్తున్నాని.. కానీ ఆయన మాత్రం పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బిజీగా ఉన్నారని ఎద్దేవా చేశారు.

    మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ మరో అడుగు ముందుకేసి సంచలన వ్యాఖ్యలు చేశారు. వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌పై ప్రధాని మోదీ ఫొటోను ఉందని.. మరి కరోనాతో మరణించిన వారి డెత్ సర్టిఫికెట్‌పైనా ఆయన ఫొటో ఉండాలి కదా? అని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఎన్ని టన్నుల ఆక్సీజన్ ఉత్పత్తి అవుతుంది? మహారాష్ట్రకు ఎంత పంపిస్తున్నారు? పూర్తి వివరాలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మహారాష్ట్ర ప్రజలు అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని విరుచుకుపడ్డారు.


    అంతేకాదు రెమెడిసివిర్ ఇంజెక్షన్‌ల విషయంలోనూ కేంద్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తోందని నవాబ్ మాలిక్ విమర్శించారు. విదేశాలకు ఎగుమతులపై నిషేధం విధిండచంతో.. మనదేశంలో ఉన్న 16 ఎక్స్‌పోర్ట్ ఓరియెంటెడ్ యూనిట్స్‌ వద్ద 20 లక్షల రెమిడిసివీర్ బాటిల్స్ అలాగే ఉండిపోయాయని అన్నారు. వాటిని మనదేశంలో అమ్మేందుకు కేంద్రం అనుమతి ఇవ్వడం లేదని మండిపడ్డారు. ఐతే ఈ ఆరోపణలను కేంద్రమంత్రి మానుష్ మాండవీయ కొట్టిపారేశారు. అరకొర జ్ఞానంతో మాట్లాడవద్దని చురకలంటించారు.

    మరోవైపు మహారాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలను కేంద్రమంత్రి హర్ష వర్ధన్ కూడా ఖండించారు. రాష్ట్రానికి అవసరమైనంత ఆక్సీజన్, కోవిడ్ వ్యాక్సిన్‌లను సరఫరా చేస్తున్నామని చెప్పారు. కరోనాను అడ్డంపెట్టుకొని రాజకీయాలు చేయవద్దని శివసేన, ఎన్సీపీ నేతలపై బీజేపీ నేతలు మండిపడుతున్నారు.

    కాగా, మహారాష్ట్రలో శనివారం 67,123 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇవాళ 56,783 మంది డిశ్చార్జి అవగా.. మరో 419 మంది మరణించారు. తాజా లెక్కలతో మహారాష్ట్రలో మొత్తం కేసుల సంఖ్య 37 లక్షల 70వేల 707కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 30 లక్షల 61వేల 174 మంది కోలుకున్నారు. కరోనా బారినపడి 59,970 మంది మరణించారు. ప్రస్తుతం మహారాష్ట్రంలో 6,47,933 యాక్టివ్ కేసలున్నాయి.
    Published by:Shiva Kumar Addula
    First published:

    అగ్ర కథనాలు