ఏపీలో చంద్రబాబు బిజీ షెడ్యూల్... రేపటి నుంచే మొదలు...

Corona Lockdown | Corona Update : ఇన్నాళ్లూ... హైదరాబాద్‌లో ఉండాల్సి వచ్చిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీకి వచ్చి... రాజకీయాల్ని హీట్ ఎక్కించబోతున్నారా?

news18-telugu
Updated: May 25, 2020, 12:25 PM IST
ఏపీలో చంద్రబాబు బిజీ షెడ్యూల్... రేపటి నుంచే మొదలు...
చంద్రబాబునాయుడు(ఫైల్ ఫోటో)
  • Share this:
Corona Lockdown | Corona Update : ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు... తన కొడుకు నారా లోకేష్, కొందరు నేతలతో కలిసి... హైదరాబాద్‌... జూబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటి నుంచి... ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్‌కి రోడ్డు మార్గంలో బయల్దేరారు. మధ్యాహ్నం లేదా సాయంత్రానికి ఆయన... అమరావతి చేరుకోనున్నారు. నిజానికి చంద్రబాబు ఫ్లైట్‌లో రావాల్సి ఉంది. ఐతే... ఏపీ ప్రభుత్వం... దేశీయ విమాన సర్వీసులను ఇవాళ వద్దనీ, రేపటి నుంచి ప్రారంభిస్తామని చెప్పడంతో... చంద్రబాబు జర్నీ ప్లాన్ మారింది. కరోనా లాక్ డౌన్ కారణంగా... 65 రోజుల పాటూ... హైదరాబాద్‌లో ఉండిపోయిన చంద్రబాబు... ఇప్పుడు ఏపీలో రాజకీయాల్ని వేడెక్కిస్తారని తెలుస్తోంది.


ఫ్లైట్‌లో వచ్చి ఉంటే... చంద్రబాబు... విశాఖ వెళ్లి... ఎల్జీ పాలిమర్స్ బాధితుల్ని కలిసేవాళ్లే. ఐతే... ప్రభుత్వం ఫ్లైట్లను ఇవాళ ప్రారంభించకపోవడంతో... చంద్రబాబు వైజాగ్ టూర్ రద్దనట్లు తెలిసింది. ఇక పార్టీ కార్యక్రమాలు, రాష్ట్ర రాజకీయాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టనున్నారు. ముందుగా... నెలాఖరున జరిపే టీడీపీ మహనాడు కార్యక్రమంపై చంద్రబాబు పార్టీ నేతలతో మాట్లాడతారు. నిజానికి ఈ నెల 27, 28న మహానాడు జరపాలనుకున్నారు. కరోనా కారణంగా... 14వేల మంది పార్టీ సభ్యులు, నేతలు, కార్యకర్తలతో జూమ్ యాప్ ద్వారా దీన్ని జరపనున్నారు. ఇందుకు సంబంధించి రేపటి నుంచి దృష్టి సారిస్తారని తెలిసింది.


ఏపీ ప్రభుత్వం రేపటి నుంచి ఫ్లైట్ సర్వీసులు నడుపుతామని చెప్పడం రాజకీయంగా దుమారం రేపుతోంది. చంద్రబాబును ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఇవాళ విమాన సర్వీసుల్ని ప్రారంభించలేదని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. చంద్రబాబు వైజాగ్ వెళ్లకుండా చెయ్యాలని వైసీపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వం కోరడం వల్లే విమాన సర్వీసుల్ని ఏపీలో ఒక రోజు రద్దు చేశామని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పురి ట్వీట్ చేసిన విషయాన్ని వాళ్లు గుర్తుచేస్తున్నారు. ముందే అనుకున్నట్లుగా ప్లాన్ ప్రకారం జరిగి ఉంటే... ఇవాళ చంద్రబాబు విశాఖ వెళ్లి ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీ ఘటనలో బాధితులైన వెంకటాపురం గ్రామస్తుల్ని, మృతుల కుటుంబాల్నీ పరామర్శించేవాళ్లు. విమానాలు లేకపోవడంతో... ప్లాన్ మొత్తం మారిపోయింది.
First published: May 25, 2020, 12:25 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading