Home /News /politics /

CORONA HITTING HARD TO TRS PARTY THAT BOTH TRS PARTY LEADERS DIAGNOSED WITH CORONA TODAY PRV

TRS Party: టీఆర్​ఎస్​లో కరోనా కలకలం.. ఒక్కరోజే ఇద్దరు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్​..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తికొనసాగుతోంది. అయితే ఇపుడు కరోనా బాధితుల్లో అధికంగా అధికార టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు (TRS party leaders) ఉండటం కలకలం రేపుతోంది.

తెలంగాణ (Telangana)లో కరోనా వైరస్ వ్యాప్తికొనసాగుతోంది. అయితే ఇపుడు కరోనా బాధితుల్లో అధికంగా అధికార టీఆర్​ఎస్​ పార్టీ లీడర్లు (TRS party leaders) ఉండటం కలకలం రేపుతోంది. తాజాగా మరో ​ టీఆర్​ఎస్​ ఎమ్మెల్యేకు కరోనా పాజిటివ్​గా (Corona positive to TRS MLA) తేలింది. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి (Muthireddy Yadagirireddy)కి కరోనా సోకింది. దీంతో ఆయన హోం ఐసొలేషన్‌లో ఉన్నారు. ఇటీవల తనతో సన్నిహితంగా ఉన్నవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.

కరోనా మొదటి వేవ్‌లో ముత్తిరెడ్డి కరోనా బారినపడ్డారు. అప్పట్లో రాష్ట్రంలో కరోనా సోకిన తొలి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి కావడం గమనార్హం. అప్పుడు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఇంట్లో నలుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. ముత్తిరెడ్డి సతీమణి, గన్‌మెన్, వంటమనిషి, డ్రైవర్‌కు కరోనా సోకింది.

కాగా, నేడు మరో ఎమ్మెల్యే, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి (Telangana State Assembly Speaker Pocharam Srinivas Reddy)కి  కరోనా వైరస్‌ సోకిన విషయం తెలిసిందే. శనివారం స్వల్పంగా లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్ట్ చేయించగా కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఎటువంటి సమస్యలు లేనప్పటికీ డాక్టర్ల సూచనల మేరకు గచ్చిబౌలిలోని ఏఐజీ హాస్పిటల్‌లో స్పీకర్ పోచారం జాయిన్ అయ్యారు. గత కొన్ని రోజులుగా తనను కలిసిన, సన్నిహితంగా ఉన్న వారు కోవిడ్ టెస్ట్ చేయించుకుని తగు జాగ్రత్తలతో హోమ్ ఐసోలేషన్‌ (Home Isolation)లో ఉండాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన మొదటిసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే.

మరోవైపు శరవేగంగా వ్యాపించే ఒమైక్రాన్‌ ప్రభావం రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ఇప్పుడిప్పుడే వేరియంట్‌ వ్యాప్తి ప్రారంభమైంది. దీని స్వభావం రీత్యా కేసులు భారీగా పెరిగే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో సుమారు 30 శాతం జనాభాకు వైర్‌స సోకే అవకాశాలున్నాయని వైద్యారోగ్య శాఖ అంచనా వేస్తోంది. సంక్రాంతి తర్వాత కేసులు పెద్దసంఖ్యలో వస్తాయని భావిస్తోంది. ఈ నేపథ్యంలో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. ఆస్పత్రులను సంసిద్ధం చేస్తోంది. వైద్య సిబ్బందికి సెలవులను రద్దు చేసింది.

ఢిల్లీతో మొదలు..

ఇటీవల ఢిల్లీకి వెళ్లిన మంత్రుల బృందం (Ministers)లో టీఆర్​ఎస్​ నేతలకు కరోనా సోకింది. తొలుత ఎర్రబెల్లి దయాకర్ రావు కరోనా (Corona positive to TRS MLA) బారిన పడ్డారు. ఆ తర్వాత ఎంపీ రంజిత్​ రెడ్డికి కరోనా పాజిటివ్​గా తేలింది. ఆ తర్వాత కేశవరావు కరోనా బారిన పడ్డారు.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Corona cases, Corona positive, TRS leaders

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు