HOME » NEWS » politics » CORONA CASES IN AP GOVT SCHOOL TEACHERS AND STUDENTS IS LOOKS LIKE WEAPON TO TDP BA BK

ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు, ప్రతిపక్షాలకు ఆయుధాన్నిచ్చిన సీఎం

కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్ట్ లు చేస్తున్నారు. కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

news18-telugu
Updated: November 4, 2020, 8:18 PM IST
ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వానికి కొత్త తలనొప్పులు, ప్రతిపక్షాలకు ఆయుధాన్నిచ్చిన సీఎం
సీఎం జగన్ (File)
  • Share this:
(ఎం. బాలకృష్ణ, సీనియర్ కరస్పాండెంట్, న్యూస్‌18)

ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠ‌శాల‌లు తెరిచింది ప్రభుత్వం. అప్పటి నుంచి జరుగుతున్న పరిణామాలతో విమ‌ర్శ‌ల‌ను మూట‌గ‌ట్టుకుంటుంది. రాష్ట్ర‌వ్యాప్తంగా పాఠ‌శాల‌లు తెరిచిన రెండో రోజు నుంచే కోవిడ్ విస్త్రత స్థాయిలో విజృభిస్తుండ‌డం ఇప్పుడు స‌ర్కార్ కు పెద్ద త‌ల‌నొప్పిగా మారింది. మ‌రో వైపు ఇదే అంశం ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు కూడా బాగా క‌లిస్తోంది. ఇప్ప‌టికే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాదాపు 150 ఉపాధ్యాయుల‌కు కోవిడ్ సోకిన‌ట్లు డీఈవో స్పష్టం చేశారు. దాంతోపాటు 9 మంది విద్యార్థులు కూడా కోవిడ్ బారిన‌పడిప‌ట్లు తెలిపారు. అయితే ఈ వ్యాప్తి పాఠ‌శాల‌లు తెర‌వ‌డం వ‌ల‌న జ‌ర‌గ‌లేద‌ని స్కూల్స్ తెర‌చి క‌నీసం రెండు రోజులు మాత్ర‌మే అయింద‌ని ఇంత‌కు ముందు నుంచే ఉపాధ్యాయుల‌కు కోవిడ్ సోకింద‌ని తెలిపారు. ఉపాధ్యాయులు విధుల‌కు హాజ‌ర‌వ‌డానికి ముందు చేసిన వైద్య ప‌రీక్ష‌ల్లో కోవిడ్ సోకినట్లు నిర్ధారించామన్నారు.

ఇదిలా ఉంటే కరోనా కారణంగా ఆలస్యంగా తెరుచుకున్నా కూడా పాఠశాలలకు వెళ్లేందుకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. ఈనెల 2 వ తేదీన పాఠశాలలు తెరవగా 4వ తేదీ బుధవారం నాటికి ఒక్క కృష్ణా జిల్లా మినహా అన్ని జిల్లాల్లో 100 శాతం ఉన్నత పాఠశాలలు తెరుచుకున్నాయి. 1, 11, 177 మంది ఉపాధ్యాయులకు గాను 99, 062 మంది పాఠశాలలకు హాజరయ్యారు. దీంతో ఉపాధ్యాయుల హాజరు 89.10 శాతానికి చేరింది. 2వ తేదీన 42 శాతం మంది విద్యార్థులు, 3న 33.69 శాతం విద్యార్థులు హాజరవ్వగా 4వ తేదీన 40.30 శాతం విద్యార్థులు పాఠశాలకు హాజరయ్యారు. కొన్ని జిల్లాల్లో కరోనా కేసులు బయటపడుతుండగా గతంలోనే వారికి సోకి తెలుసుకోకపోవటం, పాఠశాలల్లో పరీక్షలు చేసినప్పుడు అవి బయటపడుతున్నాయ‌ని మంత్రి ఆదిమూలపు సురేష్ మీడియాకి తెలిపారు.

కోవిడ్ 19 జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు టెస్ట్ లు చేస్తున్నారు. కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నామ‌న్నారు. విద్యార్థుల ఆరోగ్యమే ప్రధాన ధ్యేయంగా అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నామన్నారు. పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు మంత్రి. మాస్క్, శానిటైజేషన్, సామాజిక దూరం విషయాల్లో రాజీ పడవద్దని అధికారులకు కచ్చితమైన ఆదేశాలు ఇచ్చామన్నారు. ఇదిలా ఉంటే ఈ సమయంలో పాఠ‌శాల‌లు తెరిచి కొత్త త‌ల‌నొప్పులు తెచ్చుకున్నామ‌ని అధికార పార్టీలోనే ప‌లువురు అభిప్రాయాలు వ్య‌క్తం చేస్తోన్నారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: November 4, 2020, 8:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading