బస్సులకు నిప్పు పెట్టింది పోలీసులే : ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలు

పౌరసత్వ సవరణ చట్టంపై నిన్నటిదాకా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కొనసాగిన నిరసనలు.. ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగడంతో దేశ రాజధాని అట్టుడికింది.

news18-telugu
Updated: December 16, 2019, 8:06 AM IST
బస్సులకు నిప్పు పెట్టింది పోలీసులే : ఢిల్లీ డిప్యూటీ సీఎం సంచలన ఆరోపణలు
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన ఫోటో
  • Share this:
పౌరసత్వ సవరణ చట్టంపై నిన్నటిదాకా ఈశాన్య రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కొనసాగిన నిరసనలు.. ఇప్పుడు ఢిల్లీకి కూడా పాకాయి. ఢిల్లీలోని జామియా యూనివర్సిటీ విద్యార్థులు నిరసనలకు దిగడంతో దేశ రాజధాని అట్టుడికింది.పోలీస్ హెడ్ క్వార్టర్స్ ముందు బైఠాయించి విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీచార్జి జరపగా.. విద్యార్థులు వారి పైకి రాళ్లు రువ్వారు. యూనివర్సిటీలోకి ప్రవేశించి పలువురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు.

ఇదే క్రమంలో నిరసనకారులు మూడు బస్సులు,ఇతర వాహనాలకు నిప్పు పెట్టినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆ చర్యల వెనుకున్నది పోలీసులే అంటూ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా బాంబు పేల్చారు. బస్సును తగలబెట్టడానికి పోలీసులే పెట్రోల్ తీసుకెళ్తున్నారంటూ ట్విట్టర్‌లో కొన్ని ఫోటోలు పోస్టు చేశారు. బీజేపీ దారుణ రాజకీయాలకు ఈ ఫోటోలే నిదర్శనమంటూ అందులో పేర్కొన్నారు. బీజేపీ నేతలు ఈ ఫోటోలపై స్పందించగలరా? అంటూ ప్రశ్నించారు. కాగా,ఢిల్లీ పోలీసులు కేంద్ర హోంశాఖ ఆదేశాల మేరకు పనిచేస్తారన్న సంగతి తెలిసిందే. మరోవైపు పోలీసులు మాత్రం నిరసనకారులే బస్సులకు నిప్పంటించారని ఆరోపిస్తున్నారు.పౌరసత్వ సవరణ బిల్లుపై ఢిల్లీలో నెలకొన్న ఉద్రిక్తతలతో సోమవారం ప్రభుత్వ స్కూళ్లకు కూడా సెలవు ప్రకటించినట్టు తెలుస్తోంది.


Published by: Srinivas Mittapalli
First published: December 16, 2019, 8:05 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading