ఘర్షణ కంటే అదే నయం.. అందుకే బీజేపీలో చేరాం.. సుజనా చౌదరి

‘ఘర్షణ పడడం, పోటీపడడం కంటే సహకారం, సయోధ్యతో సాధించడం ముఖ్యం.’ బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి అన్నారు.

news18-telugu
Updated: June 20, 2019, 6:41 PM IST
ఘర్షణ కంటే అదే నయం.. అందుకే బీజేపీలో చేరాం.. సుజనా చౌదరి
బీజేపీలో చేరిన సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్
news18-telugu
Updated: June 20, 2019, 6:41 PM IST
టీడీపీ రాజ్యసభ ఎంపీలు వై.సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్ బీజేపీ కండువా కప్పుకొన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా, బీజేపీ రాజ్యసభాపక్ష నేత ధావర్ చంద్ గెహ్లాట్ సమక్షంలో వారు కమలం తీర్థం పుచ్చుకున్నారు. కాలికి గాయం కావడంతో మరో ఎంపీ గరికపాటి రామ్మోహన్ రావు ఈ కార్యక్రమానికి హాజరుకాలేదు. అయితే, ఆయన కూడా బీజేపీలో విలీనం చేయాలన్న లేఖ మీద సంతకం చేసి తమ సమ్మతిని తెలియజేశారు.

బీజేపీలో చేరిన సుజనా చౌదరి


‘దేశం మూడ్ ఎలా ఉందో ఇటీవల ఎన్నికలతో క్లియర్‌గా చూశాం. దీంతో మేం కూడా దేశ నిర్మాణంలో భాగం కావడానికి బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నాం. మోదీ కేబినెట్‌లో మూడున్నరేళ్లు సహాయమంత్రిగా కూడా పనిచేశా. ముఖ్యంగా రాష్ట్రం కోసం చేరుతున్నాం. గతంలో చాలా కారణాల వల్ల గతంలో ఇబ్బందులు పడ్డాం. విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలన్నీ వీలైనంత త్వరగా అమలు కావాలని కోరుకుంటున్నాం. అది జరగాలంటే బీజేపీనే బెస్ట్ ప్లాట్ ఫాం అని భావించాం. ఘర్షణ పడడం, పోటీపడడం కంటే సహకారం, సయోధ్యతో సాధించడం ముఖ్యం.’ బీజేపీలో చేరిన తర్వాత సుజనా చౌదరి అన్నారు.

బీజేపీలో చేరిన సీఎం రమేష్
టీడీపీ నుంచి నలుగురు ఎంపీలు చేరికతో ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ బలోపేతం అవుతుందని ఆ పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా అన్నారు.
First published: June 20, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...