news18-telugu
Updated: December 3, 2019, 1:02 PM IST
ఏపీ మంత్రి కొడాలి నాని
ఏపీ మంత్రి కొడలి నానిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీకి చెందిన యలమంచిలి పద్మజా అనే మహిళకు 41 నోటిస్ జారీ చేశారు కంచికచర్ల పోలీసులు. మంత్రి కొడాలి నాని పై మంగళగిరిలో అనుచిత వ్యాఖ్యలు చేసిన యలమంచిలి పద్మజా అనే మహిళపై కంచికచర్ల మండలం గొట్టెముక్కల గ్రామానికి చెందిన మంగళపూడి ముక్తేశ్వరరావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. దీంతో ఇవాళ పోలీసులు పద్మజను అదుపులో నికి తీసుకుని కంచికచర్ల పోలీస్ స్టేషన్ కు తరలించారు. 41 నోటిస్ జారీ చేస్తామంటున్నారు పోలీసులు. దీంతో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కంచికచర్ల పోలీస్ స్టేషన్ వద్దకు చేరుకొని ఆందోళనకు దిగారు. మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యకూడా స్టేషన్కు చేరుకొని నిరసనకు దిగారు.
మరోవైపు మంగళగిరి మండలం యర్రబాలేనికి చెందిన యలమంచిలి పద్మజ అనే మహిళా రైతు అదృశ్యమైందంటూ ఆమె కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. గత నెల 26న రాజధానిపై స్పష్టత కోసం యర్రబాలెంలో రైతులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. స్థానిక రైతులతో కలసి పద్మజ నిరసన ప్రదర్శనలో పాల్గొంది. ఈ నేపథ్యంలో ఆమె మంత్రి కోడాలి నానిపై తీవ్ర హెచ్చరికలు చేసింది. పద్మ మాటలు సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అయ్యాయి. నిన్న సాయంత్రం నుంచి పద్మ కనిపించడం లేదు. దీంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
Published by:
Sulthana Begum Shaik
First published:
December 3, 2019, 12:57 PM IST