రామ మందిర నిర్మాణానికి ఇంటికో ఇటుక ఇవ్వండి : సీఎం యోగి

కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క మతం పట్ల గానీ కులం పట్ల గానీ వివక్ష చూపించదని.. కానీ పొరుగున ఉన్న పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్‌లలో పరిస్థితి భిన్నంగా ఉందని యోగి అన్నారు.

news18-telugu
Updated: December 14, 2019, 4:39 PM IST
రామ మందిర నిర్మాణానికి ఇంటికో ఇటుక ఇవ్వండి : సీఎం యోగి
యోగి ఆదిత్యనాథ్
  • Share this:
అయోధ్యలో రామమందిర నిర్మాణానికి ప్రతీ కుటుంబం రూ.11 విలువ చేసే ఒక ఇటుకను విరాళంగా ఇవ్వాలని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ పిలుపునిచ్చారు. ఏళ్లుగా వివాదంలో నలుగుతోన్న రామ మందిర సమస్యను మోదీ పరిష్కరించారని అన్నారు. కాంగ్రెస్,ఆర్జేడీ సీపీఐ-ఎంల్ పార్టీలు రామమందిర వివాదాన్ని పరిష్కరించలేకపోయాయని విమర్శించారు. ఝార్ఖండ్‌లో ఎన్నికల ప్రచారం సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ ఓటర్లను ఉద్దేశించి మాట్లాడారు.

ఒకే దెబ్బతో కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని మోదీ రద్దు చేశారని యోగి గుర్తుచేశారు. ఇప్పుడు దేశంలో ఎక్కడికెళ్లినా..అది కశ్మీర్ అయినా,లడఖ్ అయినా, వైష్ణోమాత ఆలయమైనా.. ఎక్కడైనా భూములు కొనుక్కోవచ్చన్నారు. అలాంటి హక్కును దేశ ప్రజలకు కల్పించింది కచ్చితంగా మోదీయే అన్నారు. ఆర్టికల్ 370పై కాంగ్రెస్,ఆర్జేడీ,జార్ఖండ్ ముక్తి మోర్చా లాంటి పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని.. కానీ దాని రద్దు తర్వాత కశ్మీర్‌లో ఎక్కడా ప్రాణాలు కోల్పోయిన ఘటన జరగలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వం ఏ ఒక్క మతం పట్ల గానీ కులం పట్ల గానీ వివక్ష చూపించదని.. కానీ పొరుగున ఉన్న పాకిస్తాన్,బంగ్లాదేశ్,ఆఫ్ఘనిస్తాన్‌లలో పరిస్థితి భిన్నంగా ఉందని యోగి అన్నారు. ఆ దేశాల్లోని మైనారిటీలు తీవ్ర వివక్షకు గురవుతున్నారని, మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారని,వారి ఆస్తులు దోచుకోబడుతున్నాయని అన్నారు.కాబట్టే వారంతా శరణార్థులుగా ఇండియాకు వస్తున్నారని.. అలాంటి వారికి మోదీ సర్కార్ పౌరసత్వం కల్పిస్తోందని చెప్పారు. అలాంటి వారికి ఆశ్రయమివ్వడాన్ని వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్.. అక్రమంగా ఇక్కడికి వలస వచ్చి.. ఇక్కడి ప్రజల హక్కులను దోపిడీ చేస్తున్నవారికి మాత్రం మద్దతుగా మాట్లాడుతోందని విమర్శించారు.
First published: December 14, 2019, 4:39 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading