• HOME
  • »
  • NEWS
  • »
  • POLITICS
  • »
  • CONSTITUTION DOESNT PERMIT RESERVATIONS ON ECONOMIC GROUNDS SAYS AIMIM CHIEF ASADUDDIN OWAISI

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు చెల్లవు: ఎంపీ అసదుద్దీన్

అగ్రవర్ణ పేదలకు 10శాతం రిజర్వేషన్లు చెల్లవు: ఎంపీ అసదుద్దీన్

అసదుద్దీన్ ఒవైసీ

EBC Reservations | ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ వ్యాఖ్యానించారు. అగ్రవర్ణాల్లో పేదలకు రిజర్వేషన్లు కల్పించడం చెల్లుబాటుకాదని ఆయన వ్యాఖ్యానించారు.

  • Share this:
    అగ్ర వర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న కేంద్ర కేబినెట్ నిర్ణయాన్ని ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ తప్పుబట్టారు. ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన వ్యాఖ్యానించారు. దళితులకు జరుగుతున్న చారిత్రక సామాజిక అన్యాయాన్ని సరిచేసేందుకే రాజ్యాంగంలో రిజర్వేషన్లను కల్పించారని ఆయన పేర్కొన్నారు. పేదరిక నిర్మూలకు కేంద్ర ప్రభుత్వం పలు పథకాలు తీసుకురావచ్చని అన్నారు. అయితే రిజర్వేషన్లు సామాజిక న్యాయానికి సంబంధిన విషయంగా పేర్కొన్నారు. ఒకరి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా రిజర్వేషన్లు కల్పించడాన్ని రాజ్యాంగం అనుమతించదని ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.



    ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారికి 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలని సోమవారం కేంద్ర కేబినెట్ నిర్ణయించింది. ఈ మేరకు ఈబీసీ రిజర్వేషన్లకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్య సంస్థల్లో ప్రవేశంతో పాటు ఉద్యోగ నియామకాల్లో ఇకపై ఆర్థికంగా వెనకబడిగన అగ్రవర్ణాల ప్రజలకు 10శాతం కోటా ఉంటుంది.
    First published:

    అగ్ర కథనాలు