Home /News /politics /

CONSPIRACY TO MURDER NARA LOKESH TDP LEADERS FILES A COMPLAINT SB

వారి నుంచి నారా లోకేష్‌కు ప్రాణహానీ... తాడేపల్లిలో ఫిర్యాదు

నారా లోకేష్ (ఫైల్)

నారా లోకేష్ (ఫైల్)

మంగళగిరి వైసిపి సోషల్‌ మీడియాలో మాజీ సిఎం చంద్రబాబు, నారా లోకేష్‌పై పప్పు, దొంగ అని అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

    తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి నారా లోకేష్‌కు ప్రాణహాని ఉందంటూ టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైసిపి నాయకుల, కార్యకర్తల వల్ల లోకేష్‌కు ప్రాణహానీ ఉందంటూ గుంటూరు జిల్లా తాడేపల్లి పోలీస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆదివారం ఆ పార్టీ తాడేపల్లి పట్టణ అధ్యక్షులు జంగాల సాంబశివరావు ఆధ్వర్యంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగళగిరి వైసిపి సోషల్‌ మీడియాలో మాజీ సిఎం చంద్రబాబు, నారా లోకేష్‌పై పప్పు, దొంగ అని అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. మంగళగిరి ఎమ్మెల్యే ఆర్‌కె అనుచరులు, వైసిపి నాయకుల వల్ల నారా లోకేష్‌కు ప్రాణహాని ఉందని కూడా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

    మరోవైపు టీడీపీ నేతలు చంద్రబాబు హత్యకు కూడా కుట్ర జరుగుతుందని ఆరోపిస్తున్నారు. ఆదివారం టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మాట్లాడుతూ... చంద్రబాబును చంపేందుకు కుట్ర జరుగుతందని సంచలన ఆరోపణలు చేశారు. చంద్రబాబుకు‌ భద్రత పెంచమని హైకోర్టు చెబితే ఆ ఆదేశాల్ని పక్కన పెట్టేశారని జగన్ ప్రభుత్వంపై మండిపడ్డారు బుద్ధా. కావాలనే చంద్రబాబు ఉంటున్న ఇంటిని డ్రోన్ కెమెరాలతో అడుగడుగు విజువల్స్ తీశారన్నారు. చంద్రబాబును‌ హతమార్చే కుట్రలో భాగంగానే ఆయన ఇంటిని‌ అణువణువు డ్రోన్ తో విజువల్స్ తీసి రెక్కి నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నారని బుద్ధా వెంకన్న ఆరోపణలు చేశారు.
    Published by:Sulthana Begum Shaik
    First published:

    Tags: AP News, AP Politics, Chandrababu naidu, Mangalagiri, Nara Lokesh, Tdp

    తదుపరి వార్తలు