CONSPIRACY FOR COMMUNAL VIOLENCE IN GHMC ELECTIONS SAYS TELANGANA DGP MAHENDAR REDDY AK
GHMC Elections: అలాంటి గొడవలకు అవకాశం.. వారికి తెలంగాణ డీజీపీ వార్నింగ్
వారిని వదలిపెట్టొద్దు.. అలాంటివారిని ఇబ్బందిపెట్టొద్దు.. తెలంగాణ పోలీసులకు డీజీపీ సూచనలు
GHMC elections DGP Mahendar Reddy: గత ఆరేళ్లుగా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ పోలీసులు శాఖ విధులు నిర్వహిస్తోందని.. విధ్వంసక శక్తులను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అన్నారు.
GHMC ఎన్నికలను ఆసరాగా తీసుకోని మత ఘర్షణలకు పాల్పడే అవకాశం ఉన్నట్లు కచ్చితమైన సమాచారం ఉందని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. గత ఆరేళ్లుగా శాంతిభద్రతలు పరిరక్షిస్తూ పోలీసులు శాఖ విధులు నిర్వహిస్తోందని.. విధ్వంసక శక్తులను అడ్డుకునేందుకు పోలీసులు అప్రమత్తంగా ఉన్నారని అన్నారు. సోషల్ మీడియాలో కొందరు శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు పెడుతున్నారని.. అలాంటి వారిపై కఠిన చర్యలు ఉంటాయని డీజీపీ మహేందర్ రెడ్డి హెచ్చరించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగే పోస్టులు కనిపిస్తే ప్రజలు ఫిర్యాదు చేయాలని ఆయన సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్లలో అన్ని విభాగాల కలుపుకొని విధులు నిర్వహిస్తారని వివరించారు.
కమ్యునల్ గొడవలు పెట్టేందుకు కొంతమంది ప్రయత్నం చేస్తున్నారని సమాచారం ఉందని.. ఇప్పటివరకు 50 కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్నారని తెలిపారు. రోహింగ్యాల విషయంలో 60కి పైగా కేసులు నమోదు అయ్యాయని వెల్లడించారు.మత ఘర్షణలు జరిపేందుకు కొంతమంది వ్యక్తులు ప్రయత్నాలు చేస్తున్నారని.. వాళ్లపై తమ నిఘా ఉందని అన్నారు. తాము రహస్య సమాచారాన్ని బయటపెట్టలేమని.. అవసరం అనుకున్నప్పుడు చర్యలు ఉంటాయని అన్నారు. అన్ని రాజకీయ పార్టీల సభలకు-ర్యాలీలకు అనుమతులు ఇస్తున్నామని డీజీపీ మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.