పల్నాడులో రచ్చ వెనుక చంద్రబాబు కుట్ర.. అదేంటంటే.. : విజయసాయి రెడ్డి

యరపతినేని,కోడెల,దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న ప్రచారం ద్వారా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా చేయాలన్నది చంద్రబాబు ముఠా చేసిన కుట్ర అని ఆరోపించారు.

news18-telugu
Updated: September 11, 2019, 10:55 AM IST
పల్నాడులో రచ్చ వెనుక చంద్రబాబు కుట్ర.. అదేంటంటే.. : విజయసాయి రెడ్డి
వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(ఫైల్ ఫోటో)
  • Share this:
ఏపీలో పల్నాడు రాజకీయం అధికార-ప్రతిపక్షాల మధ్య చిచ్చు రాజేసింది. టీడీపీ వైసీపీ పరస్పరం దాడుల ఆరోపణలు చేసుకున్నాయి. ఇదే క్రమంలో టీడీపీ శరణార్థుల శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసింది.రాష్ట్రంలో అరాచక పాలన జరుగుతోందని.. వైసీపీ బాధితులకు న్యాయం చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు ఛలో ఆత్మకూరుకు పిలుపునిచ్చారు. అటు వైసీపీ కూడా ఛలో ఆత్మకూరుకు పిలుపునివ్వడంతో గుంటూరులో రాజకీయంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి టీడీపీపై ట్విట్టర్ ద్వారా విమర్శలు గుప్పించారు.

యరపతినేని,కోడెల,దూడలను రక్షించుకునేందుకే ఈ డ్రామా ఆడుతున్నారని విజయసాయి రెడ్డి విమర్శించారు. పల్నాడులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయన్న ప్రచారం ద్వారా రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రాకుండా చేయాలన్నది చంద్రబాబు ముఠా చేసిన కుట్ర అని ఆరోపించారు. పల్నాడులో ఐదేళ్లు రౌడీల రాజ్యమే సాగిందని.. ప్రశాంతత నెలకొనడం

చంద్రబాబుకు ఏమాత్రం ఇష్టం లేదని అన్నారు.పల్నాడు టీడీపీ అభిమానుల సీన్లు చూస్తుంటే అసెంబ్లీ రౌడీ సినిమా గుర్తుకొస్తోందని ఎద్దేవా చేశారు. తమలో తామే కొట్టుకుని ప్రభుత్వం మీద బురద జల్లాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇదంతా బాబు అనవసర రాద్దాంతం అని..రాష్ట్రంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు.

Published by: Srinivas Mittapalli
First published: September 11, 2019, 10:52 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading